Thursday, May 2, 2024
- Advertisement -

పుట్టిన రోజున మ‌హేశ్‌కు షాక్ ఇచ్చిన నాగ‌ర్జున‌

- Advertisement -

ఈ రోజు టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పుట్టిన రోజు.మ‌హేశ్‌ పుట్టిన రోజున ప‌లువురు సెల‌బ్రిటీలు ఆయ‌న‌కు విషెష్ చెబుతున్నారు.కాని భిన్నంగా సీనియ‌ర్ హీరో నాగ‌ర్జున మాత్రం మ‌హేశ్ పుట్టిన రోజున షాక్ ఇచ్చాడు.పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే… అడ‌వి శేష్ హీరోగా న‌టించిన గూడచారి మూవీ గ‌త వారమే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.విడుద‌లైన మొద‌టి రోజు నుండే సినిమాకు సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా విజ‌యంపై సెల‌బ్రిటీలు కూడా స్పందించారు.మ‌హేశ్ బాబు కూడా సినిమా చాలా బాగుంద‌ని ప్ర‌శంసించారు.

ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది కాని, గూడచారి స‌క్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హీరో నాగ‌ర్జున వ‌చ్చారు.ఆయ‌న ఈ సినిమా గురించి మాట్లాడుతు…ఈ సంవ‌త్స‌రం వ‌చ్చిన మంచి సినిమాల‌లో ‘రంగస్థలం’,’మహానటి’ ఆ తరువాత ‘గూఢచారి’ అంటూ ఆయన మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.పైగా ఆయన ‘నాకు తెలిసి కరెక్ట్ ఆడి, డబ్బు చేసుకున్న సినిమాలు ఈ మూడే’ అంటూ నొక్కి నొక్కి చెప్పడంతో మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మ‌హేశ్ కెరీర్‌లోనే సూప‌ర్ హిట్‌గా నిలిచిన సినిమాను ఎలా మ‌ర్చిపోతార‌ని ఆయ‌న ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -