Wednesday, May 15, 2024
- Advertisement -

నేటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ రెండో టెస్టు

- Advertisement -

ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో 0–1తో వెనుకబడిన భారత్‌ లెక్క సరి చేయా లని పట్టుదలగా ఉంది.ఎడ్జ్‌బాస్టన్‌లో చేదు ఫలితం భారత తుది జట్టులో కచ్చితంగా మార్పులు చేయాలనే పరిస్థితిని కల్పించింది. ఆ మ్యాచ్‌లో పుజారాను ఆడించకపోవడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. బర్మింగ్‌హామ్‌లో ధావన్, విజయ్, రాహుల్, రహానే పూర్తిగా నిరాశపర్చారు.

సిరీస్‌లో మనకు విజయావకాశాలు ఉండాలంటే వీరు ఇక్కడైనా తమ ఆటకు పదును పెట్టాల్సిందే. ఇంగ్లండ్‌పై మానసికంగా కూడా అతనిదే పైచేయి. ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్‌ పాత్ర మరోసారి కీలకం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఆట కూడా గొప్పగా ఏమీ లేదు. అయితే అదృష్టం కలిసొచ్చి ఆ జట్టు గట్టెక్కింది. మరోసారి కెప్టెన్‌ రూట్, ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోలపైనే భారం పడుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -