Saturday, May 11, 2024
- Advertisement -

పంచంలోనే అతిఎత్తైన ప‌టేల్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మోదీ

- Advertisement -

నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్క‌రించారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం . మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో October 31, 2013న విగ్ర‌హానికి పునాది దేశారు.

ఇప్పటి వరకూ ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహంగా చైనాలోని బుద్ధ స్ప్రింగ్ టెంపుల్ గుర్తింపు పొందింది. దీని స్థానాన్ని పటేల్ విగ్రహం భర్తీ చేయనుంది. ప్ర‌త్యేక‌త‌ల విష‌యానికి వ‌స్తే ప్ర‌పంచంలోనే అతి ఎత్తైన విగ్ర‌హం. ఈ విగ్రహాన్ని సర్దార్ సరోవర్ డ్యాంకు 3.5 కి.మీ. దిగువన సాధు బెట్ వద్ద నర్మదా నది మధ్యనున్న దీవిలో నిర్మించారు.

ఈ విగ్రహ నిర్మాణానికి 2,12,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. 18 వేల టన్నుల రీయిన్‌ఫోర్స్‌డ్ స్టీల్, 3550 టన్నుల కాంస్యం, 6 వేల టన్నుల స్ట్రక్చర్డ్ స్టీల్‌ను వాడారు. 180 కి.మీ. వేగంతో గాలులు వీచినా.. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు.

ఈ ప్రాజెక్టు మొత్తం ఖ‌ర్చు రూ. 2979 కోట్లు. 250 మంది ఇంజనీర్లు.. 3400 మంది వర్కర్లు 3 సంవత్సరాల 9 నెలలపాటు పనిచేసి విగ్రహ నిర్మాణం చేశారు. 6.5 తీవ్రతతో భూకంపం సంభవించినా ఈ విగ్రహం తట్టుకుని నిలబడుతుంది.
గంటకు 180 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచినా చెక్కు చెదరదు.

ఈ విగ్రహాన్ని రామ్ సుతార్ (93) అనే శిల్పి చెక్కారు. మహాత్మా గాంధీ విగ్రహాలను చెక్కడం ద్వారా ఆయన దేశవిదేశాల్లో పేరు సంపాదించారు. వీక్షకుల కోసం విగ్రహం లోపల 132 మీటర్ల ఎత్తులో గ్యాలరీని ఏర్పాటుచేశారు. ఇక్కడ నుంచి సర్దార్‌ డ్యామ్‌ సహా పలు పర్వత ప్రాంతాలను సందర్శించే సౌకర్యం కల్పించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -