Tuesday, May 21, 2024
- Advertisement -

స్మాల్ పెగ్‌తో రేపు వ‌స్తున్న నాగ్‌-నాని

- Advertisement -

సీనియ‌ర్ హీరో నాగ‌ర్జున‌,న్యాచుర‌ల్ స్టార్ నాని క‌లిసి న‌ట‌స్తున్న సినిమా దేవ‌దాసు.‘భలేమంచి రోజు – శమంతకమణి’ చిత్రాలతో మంచి వర్త్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న శ్రీరామ్ ఆదిత్య, ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.సినిమా ప్ర‌మోష‌న్స్ స‌రికొత్త‌గా నిర్వ‌హిస్తు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు చిత్ర యూనిట్‌.ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది.నాగ‌ర్జున ,నాని మందుకొట్టి మంచం పడుకొన్న పోజుతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వ‌దిలారు.ఇక తాజాగా ఇప్పుడు స్మాల్ పెగ్‌తో ఫస్ట్ టీజర్‌ను రిలీజ్ చేయబోతోంది.

సరిగ్గా రేపు సాయంత్రం 5గంటలకు దేవదాస్ టీజర్ కు ముహూర్తం పెట్టారు. దానికి సంబంధించిన ఒక వెరైటీ పోస్టర్ ను కూడా రెడీ చేసింది చిత్ర బృందం. “స్మాల్ పెగ్ టుమారో @ 5PM” అని పోస్టర్ మీద సిల్ హౌట్ లో నాగ్ – నానీ మందుకొడుతున్న పోజు అందరినీ భలే ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా రష్మికా మండన్న ఆకాంక్షాసింగ్ కథానాయికలుగా న‌టిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -