Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్లికి ముందు మూడు ల‌వ్ స్టోరీలు

- Advertisement -
  • వివాహ జీవితంపై న‌మిత

నేను ల‌వ్ ఫెల్యూర్‌నే.. పెళ్లికి ముందు మూడు ల‌వ్ స్టోరీలు ఉన్నాయ‌ని ఇటీవ‌ల పెళ్లి చేసుకున్న శ్రీమ‌తి న‌మిత పేర్కొంది. ప‌లు ప్ర‌త్యేక పాటలు, పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన న‌మిత త‌న ప్రియుడి వీరేంద్ర చౌద‌రిని తిరుప‌తిలో న‌వంబ‌ర్ 24వ తేదీన పెళ్లి చేసుకుంది. సంగీత్‌, పెళ్లి వేడుక‌లు సంబ‌రంగా సాగాయి. త‌న పెళ్లి జీవితం అనంత‌రం ఆమె ప‌లు విష‌యాలు అభిమానుల‌తో పంచుకున్నారు.

సీనియర్ నటుడు శరత్‌బాబుతో ల‌వ్‌లో ఉన్నానంటూ వ‌చ్చిన రూమర్‌పై న‌మిత ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు శరత్‌బాబు ఎవరో తనకు తెలియదని.. తన గురించి వస్తున్న వార్తలు చూశాక.. ఆయన గురించి ఇంటర్‌నెట్‌లో వెతికి తెలుసుకున్నానని చెప్పింది. ఇదే ముచ్చ‌ట‌లో ఆమె వీర్‌ను పెళ్లాడక‌ముందు తన జీవితంలో మూడు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పింది.

ఐతే అవన్నీ ముగిసిన కథలని, ఆ లవ్ స్టోరీల తర్వాతే జీవితంలో సరైన వ్యక్తిని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో తనకు ఆ ఫెయిల్యూర్ స్టోరీలు చెప్పాయ‌ని తెలిపింది. వీర్‌తో ల‌వ్ విష‌యం కూడా పంచుకుంది. వీర్ ఏళ్లుగా తనకు పరిచయమని.. తనే మనం పెళ్లి చేసుకుందాం అన్నపుడు అతడికి నో చెప్పడానికి ఒక్క కారణం కూడా కనిపించలేదని పేర్కొంది. ఒక‌వేళ త‌ను ప్ర‌పోజ్ చేయ‌క‌పోయి ఉంటే నేనే చేశాన‌ని సిగ్గుప‌డుతూ చెబుతోంది.

తన వైవాహిక జీవితం చాలా బాగుందని.. పెళ్లి తర్వాత తన ఒంటి మీదికి మంగళసూత్రం, మెట్టెలు మాత్రమే వచ్చాయని.. అంతకుమించి మార్పేమీ లేదని త‌న‌దైన శైలిలో చెప్పింది. సంప్రదాయ బద్ధంగా కుంకుమ పెట్టుకో.. చీర కట్టుకో అంటూ తన అత్తింటి వాళ్ల నుంచి ఎలాంటి ఒత్తిళ్లూ లేవని తెలిపింది. మొత్తానికి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో మ‌రో ప్రేమ‌ జంట ప్రేమ వివాహం చేసుకుంది.

https://www.youtube.com/watch?v=cDMtFrM9t3o

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -