Friday, April 19, 2024
- Advertisement -

మహేశ్ విషయంలో తన కంప్లైట్స్ ఏమిటోచెప్పిన నమ్రతా!

- Advertisement -

మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు నిర్వచనంలా ఉంటారు మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ లు. కలిసి నటించి.. ప్రేమలో పడి పెళ్లి చేసుకుని.. పిల్లలతో హ్యాపీగా కనిపించే ఈ జంట తెలుగు వాళ్ల దృష్టిలో ఒక బెస్ట్ పెయిర్ . మహేశ్ స్టార్ హీరో నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న నేపథ్యంలో నమ్రత కూడా ఆయనకు భార్యగా ఎంతో ఫేమ్ ను పొందుతోంది. పిల్లలు గౌతమ్ , సితారలు ఈ దాంపత్యంలోని ఆకర్షణలుగా మారారు. మరి ఇలాంటి సమయంలో కూడా నమ్రతకు మహేశ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయండోయ్. ఆ ఫిర్యాదులనే నమ్రత వివరించింది.

మహేశ్ పై నమ్రత చేసే కంప్లైంట్స్ లో ముఖ్యమైనది ఏమిటంటే.. ఆయన తనకోసం ఎలాంటి షాపింగ్ చేయడు, ఏమీ కొనడదు అనేది! అసలు మహేశ్ కు తన కోసం షాపింగ్ చేసే సమయం ఉండదని నమ్రత తన తాజా ఇంటర్వ్యూలో ఫిర్యాదు చేసింది. కుటుంబం కోసం ఎంతో సమయాన్ని వెచ్చించే మహేశ్ తన కోసం షాపింగ్ చేయడానికి మాత్రం ఆసక్తి చూపడని ఆమె వివరించింది.

తన కోసం అయినా.. పిల్లల కోసం అయినా.. తనే షాపింగ్ చేస్తానని ఆమె చెప్పింది. సాధారణంగా అమెరికా, దుబాయ్ లలో షాపింగ్ తనకు ఇష్టం అని నమ్రత వివరించింది. అయితే అమెరికానే తను ఎక్కువగా ప్రిఫర్ చేస్తానని వివరించిందామె.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -