Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ బ్రేకింగ్…. దశావతారాలు కాదు…..62అవతారాల్లో బాలయ్య

- Advertisement -

ఒక సినిమాలో ఒక హీరో పది గెటప్పుల్లో కనిపిస్తేనే అదో పెద్ద సంచలనం. మరి ఒకే హీరో….ఒక సినిమాలో 62అవతారాల్లో కనిపిస్తే ఏమనాలి? అసలు ఆ ఫీట్ సాధ్యమా? సినిమా మొత్తం ఉండే కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్రలే 20కంటే తక్కువగానే ఉంటూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో హీరో ఒక్కడే 62 గెటప్పుల్లో కనిపించడమంటే ఆ సినిమా నిడివి ఎంత ఉండాలి? ఇక హీరోకి కాకుండా ఇతర పాత్రలకు ఏమైనా అవకాశం ఉంటుందా? అన్న విషయాలను పక్కనపెడితే బాలయ్య మాత్రం ఒకేసినిమాలో 62గెటప్పులు వేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ గెటప్పులన్నీ కూడా ఒక్కోటి ఒక్కో పాత్రలా కనిపిస్తాయట.

అలనాడు ఆబాల గోపాలాన్ని అలరించిన నందమూరి తారక రామారావు జీవితకథను సినిమాగా తీయాలని బాలయ్య ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణనే కనిపిస్తాడనడంలో సందేహం లేదు. అయితే సినిమా మొత్తం మీద 62గెటప్పుల్లో కనిపిస్తానని తాజాగా బాలయ్య చెప్పుకొచ్చాడు. ప్రపంచంలోనే ఇలా కనిపించే అదృష్టం ఇంకెవరికీ దక్కలేదని కూడా బాలయ్యే చెప్పాడు. ఎన్టీఆర్ జీవిత కథా చిత్రంలో 62 గెటప్పుల్లో కనిపించి ఆ అద్భుతాన్ని నేను సాధిస్తానన్నాడు బాలయ్య. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయని……నందమూరి అభిమానులందరికీ కూడా ఆ సినిమా పండగలా ఉంటుందని చెప్పుకొచ్చాడు బాలయ్య.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -