Friday, May 10, 2024
- Advertisement -

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈ గీతం నీకు అంకితం

- Advertisement -

‘కొడకా కోటేశ్వరరావు’ పాట యూట్యూబ్‌లో వారం రోజులుగా ట్రెండింగ్‌గా ఉంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ న‌టించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది. ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాటకు విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ పాట‌ను ఓ పొలాండ్ బుడ్డోడు పాడి ప‌వ‌న్‌ను ఆక‌ట్టుకున్నాడు. దీంతో ‘హే పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘కొడకా కోటేశ్వరరావు’ అంటూ పాట పాడి విడుద‌ల చేశారు. నా స్టైల్‌లో ఈ పాట పాడి నేను మీకు ఇస్తు కానుక ఇది.’ అంటూ పవన్‌కు ట్వీట్‌ చేశాడు. అది చూసిన పవన్ స్పందించాడు. ‘మై డియర్‌ లిటిల్‌ ఫ్రెండ్‌..ఈ కొత్త కానుక ఇచ్చినందుకు ధన్యవాదాలు. నీ సందేశం నాకు అందింది. గాడ్‌ బ్లెస్‌యూ’ అని ట్వీట్‌ చేశారు.

ఆ లిటిల్ ఫ్రెండ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై అభిమానంతో ఓ పాట‌ను అంకితం చేశాడు. అత‌డు తెలుగులో పాట రచించి స్వ‌యంగా పాడి విడుద‌ల చేశారు. పోలండ్‌కు చెందిన బిగ్నీవ్ చెర్టలూర్ (Zbigniew A. Chertlur) ఏడేళ్ల పిల్లాడు ప‌వ‌న్‌కు వీరాభిమానిగా మారాడు. బుజ్జిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇప్పుడు ఈ పాట విడుద‌ల చేయ‌డంతో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా చేస్తున్నాడు. మొన్న టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా మంగ‌ళ‌వారం (జ‌న‌వ‌రి 9వ తేదీ) ఆ పాట మొత్తం విడుద‌ల చేశాడు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టించిన అన్నీ సినిమాల పేర్ల‌ను తీస్కొని పాట అందుకున్నాడు. కొత్త కొత్త డ్రెస్సుల్లో క‌నిపిస్తూ డ్యాన్స్ చేస్తున్నాడు. ప‌వ‌న్‌పై త‌న‌కున్న అభిమానాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించాడు.ఈ బుడ్డోడు ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన శరత్ చెర్తులూరు అనే వ్యక్తి కుమారుడుఉ బిగ్నివ్ చెర్ట‌లూర్‌. అతడి తల్లి పొలండ్ దేశస్తురాలు  ఉర్సులా ఎలిజ్బెతియా. వీరు అక్క‌డే నివ‌సిస్తూ తెలుగు రాష్ట్రాల‌పై ఇంకా అభిమానం పెంచుకున్నారు.

https://www.youtube.com/watch?v=EHUnWwZbyME&feature=youtu.be

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -