అఖండ హిట్‌తో మంచి జోరుమీదున్నారు హీరో బాలకృష్ణ. ఇదే ఊపు మీద మరో పవర్ ఫుల్ అవతారం ఎత్తబోతున్నారీ నట సింహం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. #NBK107 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ అదిరిపోయే లుక్‌లో దర్శనం ఇవ్వబోతున్నారు. బాలకృష్ణ లుక్ ను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.ఈ ఫొటో బాలకృష్ణ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. బాలకృష్ణ లుంగీ ధరించి, కళ్లజోడు పెట్టుకుని స్టైలిష్‌గా కనిపించారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ యాక్షన్ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఏపీలో పొగబెడుతున్నారు.. తెలంగాణలో రా..రమ్మంటున్నారు.
విజయ్ దేవరకొండ ఎలాంటి వాడు అంటే.. అనన్య పాండే సంచలన కామెంట్స్