Sunday, April 28, 2024
- Advertisement -

ఏపీలో పొగబెడుతున్నారు.. తెలంగాణలో రా..రమ్మంటున్నారు.

- Advertisement -

భీమ్లానాయక్ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్‌ డిస్కషన్‌ నడుస్తున్న సినిమా. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన ఈ చిత్రం ఈనెల 25వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, ఈ అంశం ఇప్పుడు సినిమా కోణంలోనే కాదు. రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా సాగుతున్న పరిణామాలు ఈ చర్చకు కారణమయ్యాయి. ఏపీలో సినిమా పరిశ్రమ వర్సెస్‌ ప్రభుత్వం మధ్య కొన్నాళ్లు వార్‌ నడిచింది. అయితే, ఇటీవలే ఆ గ్యాప్‌ తగ్గించుకునే లక్ష్యంతో ఏపీ సర్కారు చొరవ తీసుకుంది. అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్‌ టాలీవుడ్‌ సినిమా ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించారు. అయితే, పవన్‌కల్యాణ్‌ను మాత్రం దూరం పెట్టారు.

కానీ, ఇటు తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సర్కారు అండగా నిలిచే సంకేతాలు పంపిస్తోంది. భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇప్పుడీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. పవన్‌ కల్యాణ్ ను రాజకీయ కోణంలో చూస్తున్న ఏపీ ప్రభుత్వం వినోదం విషయంలోనూ అదే ధోరణితో వ్యవహరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే పవన్‌ కల్యాణ్ విషయంలో అంటీ ముట్టనట్టు ఉంటుందటున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అన్నట్లుగా తనదైన వ్యూహం అనుసరిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోకోణంలో చూస్తే.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన సినిమాలకు జోష్‌ ఎక్కువ. ఆయన డైలాగ్‌లకు, నటనకు ఫిదా అయ్యేవాళ్లు ఎక్కువ. అయితే, ఇప్పుడు మాత్రం పవన్‌ కల్యాణ్‌ సినిమా హీరో మాత్రమే కాదు.. ఓ రాజకీయపార్టీకి అధినేత. కానీ, రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన పట్ల అనుసరిస్తున్న ధోరణి విభిన్నంగా ఉంటోంది. ఈ అంశం గురించి టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ చర్చ జరుగుతోంది.

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో టాలీవుడ్ కూడా అగ్రభాగంలో ఉంటుంది. ఈ కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. పాత తరహాలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతుల ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే కొన్ని ప్రోత్సాహకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం కల్పిచింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఏపీలో టిక్కెట్ రెట్ల పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పవన్ అభిమానులు మండిపడుతున్నారు. కేవలం తమ అభిమాన నటుడిని ఆర్థికంగా దెబ్బ కోట్టాలనే ప్రభుత్వం పన్నాగం చేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంకా టిక్కెట్ రేట్లు పదేళ్ల కిందటి నాటివి ఖరారు చేయడం వంటి నిర్ణయాలతో ప్రభుత్వం సినీ పరిశ్రమతో ఆటాడుకుంటోందని పలువురు సిని ప్రముఖులు పెదవి విప్పారు. ఓ సినిమా విడుదల చేయాలంటే అటు ఏపీ.. ఇటుతెలంగాణలో ఒకే సారి విడుదల చేసుకోగలగాలి. లేకపోతే గిట్టుబాటు కాదు. అందుకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఏపీ ప్రభుత్వ ఆంక్షల వలలో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

భారీ పరితోషకం తీసుకున్న దీపికా పదుకొణె

స్పైసీగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌ల్లు బ్యూటీ

సర్జరీతో మరింత అందం పోందిన హీరోయిన్స్ వీరే…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -