Saturday, May 11, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ ఎలాంటి వాడు అంటే.. అనన్య పాండే సంచలన కామెంట్స్

- Advertisement -

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండపై ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. విజయ్ దేవరకొండ సహజంగా ఒక పిరికివాడని కామెంట్ చేసింది. ఆన్‌స్క్రీన్ విజయ దేవరకొండ వేరని.. బయట విజయ్ దేవరకొండ వేరని చెప్పింది. సినిమాల్లో కనిపించేదానికి పూర్తి భిన్నంగా విజయ్ బయట ఉంటాడని తెలిపింది. అదే సమయంలో విజయ్ బెస్ట్ కో స్టార్ అంటూ పొగడ్తలు కురిపించింది. ప్రస్తుతం అనన్య కామెంట్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా విజయ్ దేవరకొండను చూస్తే యాటిట్యూడ్ కా బాప్ అనేలా ఉంటాడు. స్టేజీ పైకి ఎక్కాడంటే తన స్పీచులతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తాడు. అర్జున్ రెడ్డి పాత్రలో విజయ్ డేరింగ్ యాటిట్యూడ్ ఎంతమందిని ఫిదా చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి విజయ్ దేవరకొండను పిరికివాడంటూ అనన్య పాండే కామెంట్స్ చేయడం విజయ్ ఫ్యాన్స్‌లో చర్చకు దారితీసింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ‘మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్’ నేపథ్యంలో సాగనుంది. ఇప్పటికే విడుదలైన లైగర్ టీజర్ అభిమానులను ఉర్రూతలూగించింది. టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో విజయ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆహాలో సందడి చేయనున్న క్యూట్ భామ

ఐశ్వర్య సంచలన వ్యాఖ్యలు.. ధనుష్‌ను ఉద్దేశించేనా ?

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -