Sunday, May 5, 2024
- Advertisement -

నియ్యమ్మ, చెత్తనా…… కొడకా…….. బాలయ్య, పవన్‌ల సంస్కారం ఇదేనా?

- Advertisement -

ఒకరేమో అధికార పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రపంచంలో ఉన్న ఏ గొప్ప విషయంలోనైనా మా కుటుంబమే గొప్ప, మాదే చరిత్ర అని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు. మరొకరేమో పవన్ కళ్యాణ్. తనకు తాను దేవుడిగా మూడాభిమానుల చేత పిలిపించుకోబడుతున్న నటుడు. మానవత్వం, నైతిక విలువలు, నిజాయితీ విషయంలో పవన్ కళ్యాణ్….అది….ఇది…ఆయన స్థాయి వేరు అంటూ పవన్‌తో అవసరం ఉన్న సినిమా వాళ్ళు ఓ స్థాయిలో పొగిడేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అభిరుచులు మాత్రం మరీ దిగువస్థాయిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ మధ్య అర్జున్‌రెడ్డి సినిమా వస్తే అందరూ ఆడిపోసుకున్నవాళ్ళే. ఆ సినిమాలో కాస్తంత శృతిమించిన డైలాగ్స్ ఉన్నాయన్నది నిజం. కానీ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తూ ఆ సినిమా హీరో, డైరెక్టర్ ఇచ్చిన వివరణ ఎక్కువ మందికి సబబుగానే అనిపించింది. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఓ స్థాయిలో వినిపించాయి.

ఇప్పుడు బాలకృష్ణ తన తాజా సినిమాలో ‘బొమ్మ తిరగేస్తా…….నియ్యమ్మ’ అన్న బూతు పదాన్ని అద్భుతంగా పలికేశాడు. ఇక తాజాగా తను పాడిన కొడకా కోటేశ్వరరావా…….పాటలో పవన్, త్రివిక్రమ్‌లు చాలా తెలివిగా…….‘చెత్త నా………’ అని చిన్న పాజ్ ఇచ్చి…….‘కొడకా…..’ అంటూ కంటిన్యూ చేశారు. అర్జున్‌రెడ్డిలో ఉన్న బూతుల వళ్ళే యూత్ అంతా ఎగబడ్డారన్న తప్పుడు విశ్లేషణ ఒకటి సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. ప్రేక్షకులు దేనికి ఆసక్తి చూపిస్తారో వాటికి పెద్ద పీట వేస్తూ క్యాష్ చేసుకోవడం సినిమా వాళ్ళకు కామన్. కానీ మహిళల శారీరక అందాలు, నీచమైన భంగిమలు, అవధులు మించిన శృంగారం చూపిస్తూ కొంతమంది ప్రేక్షకుల బలహీనతలు క్యాష్ చేసుకుందామని నీచమైన ఆలోచనలు చేస్తేనే ప్రశ్నించాల్సి వస్తుంది. అర్జున్‌రెడ్డిలో బూతులకు యువత అట్రాక్ట్ అయి ఉండొచ్చుగాక. కానీ ప్రజాప్రతినిధి అయిన బాలయ్య, రాజకీయాల్లో ఎన్నో సుద్దులు చెప్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం మరీ ఈ స్థాయికి దిగజారడం సరైనది కాదు. స్టార్ పవర్, స్టార్ ఢం అంటూ ఆడియో ఫంక్షన్‌లలో ఓ స్థాయిలో భజన చేయించుకునే హీరోలు నాలుగు డబ్బులు ఎక్కువ రావడం కోసం బజార్లో బూతులు మాట్లాడుకునే స్థాయికి దిగజారాలా?

మన దగ్గర చిన్నవాడు, బలహీనుడు ఏదైనా తప్పు చేస్తే తప్పు పట్టడానికి విమర్శించడానికి అందరూ ముందుకు వస్తారు. అదే బలం, బలగం, అధికారం ఉన్న పెద్దవాడు చేస్తే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. ఇప్పుడు కూడా సేం టు సేం. అర్జున్‌రెడ్డిపై విరుచుకుపడిన జనాలకు……..బాలయ్య నోటి నుంచి వచ్చిన ‘బొమ్మ చూపిస్తా………నియ్యమ్మ’ అన్న మాట, పవన్ నోట పలికిన….‘చెత్త నా ———కొడకా’ అన్న బూతులు మాత్రం అస్సలు కనిపించవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -