Monday, April 29, 2024
- Advertisement -

ద‌క్షిణాప్రికా బోర్డుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోహ్లీ….

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లికి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీమిండియా ప్రాక్టీస్ కోసం అక్కడి పరిస్థితులకి అనుగుణంగా పచ్చికతో కూడిన పిచ్‌ను భారత్ టీమ్ మేనేజ్‌మెంట్ అడిగితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు మాత్రం జీవం లేని పిచ్‌ను కేటాయించడాన్ని కోహ్లి తప్పుబట్టాడు. ప్రాక్టీస్‌కి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వార్మప్ మ్యాచ్‌ని సైతం రద్దు చేసుకున్న కోహ్లిసేనకి ఇది మింగుడపడటం లేదు. కేప్ టౌన్ వేదికగా శుక్రవారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.

ఇక్కడ మాకు ఉన్న ఓకే ఒక్క ఆప్షన్‌ సాధ్యమైనంత ఎక్కువ నీటితో తడిపిన పిచ్‌తో పాటు గట్టిగా చదును చేసిన పిచ్‌. సఫారీలో పరిస్థితులకు అనుగుణంగా పేస్‌ బౌలింగ్‌ను ప్రాక్టీస్‌ చేయడానికి పిచ్‌ను తయారుచేయమన్నాం. అయితే ప్రాక్టీస్‌ సెషన్‌ కోసం తయారు చేసిన పిచ్‌ ఎటువంటి జీవం లేకుండా ఉంది. ఈ తరహా పిచ్‌పై నాణ్యమైన గేమ్‌ జరుగుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేమ‌న్నారు.

అటువంటప్పుడు పిచ్‌ను ఇలా తయారు చేయడం ఎందుకు. రెండు రోజుల గేమ్‌ మాత్రమే ఉన్నప్పుడు ఇటువంటి పిచ్‌లు తయారుచేస్తారు. క్రీజ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు తొందరగా యాభై పరుగులు చేయడం, ఆపై పెవిలియన్‌కు పరిమితం కావడానికే ఈ పిచ్‌లు రూపొందిస్తారు’ అని కోహ్లి విమర్శించాడు. ఈ తరహా జీవం లేని పిచ్‌పై ఫాస్ట్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినా అది సిరీస్‌లో మాకు అక్కరకు రాదు. ఇలా నాణ్యత లేని పిచ్‌ను టీమిండియాకి ఎందుకు కేటాయించనట్లో..?’ అని కోహ్లి పెదవి విరిచాడు.

ప్రాక్టీస్‌ సెషన్‌ పిచ్‌పై టీమిండియా జట్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని డబ‍్యూపీసీసీ ధృవీకరించింది. వారు పూర్తి పచ్చికతో కూడిన పిచ్‌ను తయారు చేయమన్న వాస్తవమేనని, కాకపోతే దాన్ని తయారుచేయడానికి శతవిధాలా ప్రయత్నించామన్నాడు. బ్యాలెన్స్‌ చేస్తూ పిచ్‌ను రూపొందించడం వల్ల వారు కోరిన పిచ్‌ను ఇవ్వలేకపోయామని డబ‍్యూపీసీసీ గ్రౌండ్స్‌మన్‌ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -