Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌ బయోపిక్‌ కొత్త పోస్టర్ విడుద‌ల‌

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా మార్చి 29న ప్రారంభం కానుంది. తేజ దర్శకత్వం‍లో తెరకెక్కనున్న ఈ సినిమాను వారాహి చలనచిత్రం బ్యానర్‌తో కలిసి బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్‌ ను రూపొందించారు.

ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అ‍ద్భుత పాత్రలతో పాటు రాజకీయ ప్రవేశం సందర్భంగా ఎన్టీఆర్ ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ఈ ఫోటోను బాలీవుడ్ అన‌లిస్ట్ త‌రుణ్ ఆద‌ర్శ్ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -