Tuesday, May 7, 2024
- Advertisement -

మంచు మనోజ్ పై నందమూరి ఫ్యాన్స్ అభినందనలు

- Advertisement -

సినీ నటుడు, సీనియర్ టీడీపీ నేత నందమూరి హరికృష్ణ ఆఖరి కోరికను నటుడు మంచు మనోజ్ నెరవేర్చారు. హరికృష్ణకు అసలైన నివాళర్పించారు. దీంతో నందమూరి అభిమానులతో పాటు టీడీపీ నేతల అభిమానాన్ని గెల్చుకున్నారు. హరికృష్ణ మరణం తర్వాత ఆయన రాసిన లేఖ బయటపడింది. రానున్న సెప్టెంబర్ 2న హరికృష్ణ పుట్టినరోజు. ఆ సందర్భంగా పూలబొకేలు, పళ్లు, దండలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు తన కోసం కొనవద్దని శ్రేయోభిలాషులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలను హరికృష్ణ కోరారు. పుట్టినరోజు వేడుకల పేరుతో డబ్బులు వృథా చేయవద్దని విన్నవిస్తూ ఆయన లేఖ రాసుకున్నారు. తన బర్త్ డే వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బులను కేరళ వరద బాధితులకు ఖర్చు చేయాలని సూచించారు. కూడు గూడు లేకుండా నిరాశ్రయులైన కేరళ వరద బాధితులును ఆదుకోవాలని సూచించారు. రోడ్డున పడ్డ వారి ఆకలి తీర్చాలని, దుస్తులు, మందులు అందజేయాలని కోరారు. వృద్ధులు, పసిపిల్లలకు పాలు, ఇతర అత్యవసర మందులు అందిస్తే తాను సంతోషిస్తాను, కానీ పుట్టిన రోజు వేడుకల పేరుతో దుబారా చేయవద్దని హరికృష్ణ లేఖ ద్వారా తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలను కోరారు.

ఆ లేఖను చూసిన మంచు మనోజ్ అక్షరాలా దాన్ని నెరవేర్చారు. హరికృష్ణ కోరినట్లే తన వంతుగా కేరళ వరద బాధితులకు 5 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన నందమూరి అభిమానులు కూడా ఆయన ఆఖిరి కోరిక ప్రకారం కేరళ వరద బాధితులను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. అంతకముందు కూడా హరి మరణవార్త వినగానే ట్విట్వర్ ద్వారా సంతాపం తెలిలిన మనోజ్ మీడియాకు కూడా ఓ విజ్ఞప్తి చేశాడు. పదే పదే యాక్సిడెంట్ దృశ్యాలు చూపించి నందమూరి కుటుంబీకులు, అభిమానులను మరింత క్షోభకు గురిచేయవద్దని వేడుకున్నాడు. తన వినతిని మన్నిస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. పార్టీ శ్రేణులు కూడా బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయకుండా హరికృష్ణ కోరినట్లు కేరళ వరద బాధితులకు సహాయంగా నిలవాలని మరోసారి మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. అతడు చేసినట్లే తాము కూడా వారికి సాయమందిస్తామని టీడీపీ కార్యకర్తలు, నందముూరి అభిమానులు స్పందిస్తున్నారు. మొత్తానికి కష్టకాలంలో మంచుమనోజ్ నందమూరి కుటుంబానికి అండగా ఉంటూ, హరికృష్ణ ఆఖరి కోరిక తీర్చాడని టీడీపీ శ్రేణులు, నెటిజన్లు అతడిని కొనియాడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -