Thursday, May 9, 2024
- Advertisement -

హిట్టు దక్కినా నందమూరి హీరో కష్టాల్లో కూరుకుపోయాడా..?!

- Advertisement -

‘పటాస్’ తో  తన కెరీర్ లోనే గ్రాండ్ హిట్ ను అందుకొన్నాడు కల్యాణ్ రామ్. చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ‘అతనొక్కడే ‘ తర్వాత సరైన హిట్ లేని కల్యాణ్ రామ్ కు పటాస్ చాలా వరకూ ఊరటినిచ్చే ఉండవచ్చు.

అయితే ఆ తర్వాత మాత్రం ఈ హీరో పరిస్థితి ఏమంత గొప్పగా లేదనుకోవాల్సి వస్తోంది! ఎందుకంటే.. ఆ తర్వాత ఈ హీరో కెరీర్ అంత ఊపులో కనిపించడం లేదు. కేవలం హీరోగానే కాకుండా ‘కిక్-2’తో ప్రొడ్యూసర్ గా కూడా అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నాడు కల్యాణ్ రామ్.

అయితే  ఆ సినిమా విడుదలకు నోచుకోవడం లేదు. రవితేజ హీరోగా నటించిన ఆ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. అయితే విడుదల మాత్రం జరగడం లేదు. మరి ఒక సినిమా విడుదల కాకపోతే నిర్మాతకు కచ్చితంగా కష్టమే అనుకోవాలి. ఈ విధంగా చూస్తే కల్యాణ్ రామ్ ఇబ్బందుల్లో ఉన్నట్టే.. అలాగే అతడే స్వయంగా హీరోగా నటించిన ‘షేర్’ కూడా విడుదల కావాల్సి ఉంది. దానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా ఏమీలేవు.

ఇదంతా చూస్తుంటే.. కల్యాణ్ రామ్ కెరీర్ కొంత ఇబ్బందుల్లో ఉన్నట్టుగానే ఉంది. పటాస్ తో హిట్ దక్కినా ఆ స్థాయిలో అతడు దూసుకుపోలేకపోతున్నట్టుగా ఉన్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -