Wednesday, May 8, 2024
- Advertisement -

అసలు ఏం జరిగింది..! కారులో ఉన్నది ఉగ్రవాదా!?

- Advertisement -

అదొక  నేషనల్ హైవే… ఓ ఆసామి తన కారు మీద స్పీడ్ గా వచ్చాడు.అతని స్పీడ్ ను చూసిన పోలీసులు ఎప్పటిలాగానే ఆపే ప్రయత్నం చేశారు.కానీ ఆకారుగారు ఆగలేదు.కాని ముందున్న వెహికల్స్ అడ్డంగా ఉండడంతో ….ఎలా వచ్చారో అదే స్పీడ్ లో రివర్స్ గేర్ వేసారు.

వెనకున్న వాహనాలను, మనుషులను గుద్దుకుంటూ అది సృష్టించిన భీభత్సంతో ప్రజలే కాదు పోలీసులు కూడా షాక్ తిన్నారు. 

అసలిక్కడ  జరిగిందేంటంటే…. ఉత్తరాఖండ్ లోని హరిద్వారాలో నేషనల్ హైవేమీద పోలీసులు చెకింగ్ లు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ సంఘటనలో వెనక వస్తున్న ఓ స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ డ్రైవర్ మళ్ళి కారును ముందుకు నడిపాడు. పోలీసులందరూ పట్టుకుందామని పరిగెత్తినా లాభం లేకపోయింది. ఓ కానిస్టేబుల్ మీదికి ఆ కారు దూసుకు రావడంతో అతను కారుపై నుంచి పల్టీలు కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో కారులో ఉన్నది ఏ ఉగ్రవాదో అయ్యుంటాడని అందరూ అనుమానించారు.

దీంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఎట్టకేలకు కారును ఆపి డ్రైవర్ ను అరెస్టు చేశారు. అతన్ని పట్టుకుని విచారించగా అతను….హర్యానా రాష్ట్రం సోనీపట్ కు చెందిన ఓ వ్యక్తి. అతను మందులోని రా ఫుల్ గా కొట్టేసి  డ్రైవింగ్ చేశాడని అర్దమైంది. అతనిపై కేసు పెట్టి జైలు కు పంపిన పోలీసులు, గాయపడ్ద ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఆస్పత్రికి చికిత్సకోసం పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -