Saturday, May 4, 2024
- Advertisement -

పవన్, బాలయ్యలపై కళ్యాణ్ రామ్ సెటైర్స్…… అభిమానులు సీరియస్

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో నందమూరి కళ్యాణ్ రామ్‌కి కాస్త మంచి పేరే ఉంది. రొటీన్ మాస్ జపం చేస్తూనే ఉంటాడుకానీ మధ్య మధ్యలో మాత్రం కాస్త అభిరుచి ఉన్న సినిమాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కమర్షియల్ ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. మామూలుగా అయితే అందరినీ కలుపుకుని పోయే రకం కళ్యాణ్ రామ్. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

ఎమ్మెల్యే ట్రైలర్‌లోనూ, సినిమాలోనూ రాజకీయ డైలాగులు ఉన్నాయన్నది నిజం. ఆ డైలాగులన్నీ కూడా భవిష్యత్తులో తన రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడేలా కళ్యాణ్ రామ్ ప్లాన్ చేశాడా? ఇదే అనుమానం మీడియాకు కూడా వచ్చింది. అదే ప్రశ్న కళ్యాణ్ రామ్‌ని అడిగినప్పుడు కళ్యాణ్ రామ్ చెప్పిన సమాధానం మాత్రం బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు సెటైర్‌లా తగిలింది. చిరంజీవి కూడా పొలిటికల్ ఎంట్రీకి ముందు చాలా తెలివిగా ఠాగూర్, స్టాలిన్ లాంటి సినిమాలు చేశాడన్నది నిజం. ఇక పవన్ కళ్యాణ్ కూడా గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్‌, కాటమరాయుడులాంటి సినిమాల్లో తన నిజ జీవిత రాజకీయాలకు ఉపయోగపడేలా పొలిటికల్ డైలాగ్స్ కూడా రాయించుకున్నాడన్నది నిజం. ఇక ఈ విషయంలో నందమూరి బాలయ్య అయితే పీక్స్. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌పైన కూడా ఒకే భ్రమల్లో ఉండే బాలయ్య……మా వంశం, చరిత్ర, ఢిల్లీ గద్దె అంటూ పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటాడు. మళ్ళీ మళ్ళీ అలాంటి డైలాగ్స్ రాయించుకుంటూ ఉంటాడు.

అయితే ఇప్పుడు కళ్యాణ్ రామ్ మాత్రం అలాంటి రాజకీయం ఎప్పుడూ చేయనని చెప్పుకొచ్చాడు. డైలాగులన్నీ సినిమా కథలో భాగంగా ఉంటాయి, సినిమాకు న్యాయం చేసేలా ఉంటాయి కానీ తన రాజకీయ స్వార్థం కోసం డైలాగులు రాయించి సినిమాకు అన్యాయం చేయనని చెప్పుకొచ్చాడు. అసలు ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్ధేశ్యం లేదు అన్న కళ్యాణ్ రామ్ మాటలు ఒకే కానీ రాజకీయ, వ్యక్తిగత స్వార్థం కోసం సినిమాలకు అన్యాయం చేయనని, ఏం చేసినా నిజాయితీగా చేస్తానని తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడం మాత్రం సినిమాలను రాజకీయ లాభాల కోసం కూడా వాడుకుంటున్న పవన్, బాలయ్యలాంటి వాళ్ళ చర్యలను విమర్శించడమే అవుతుందనడంలో సందేహం లేదు. ఇదే విషయం తీసుకుని కొంతమంది నెటిజనులు బాలయ్య, పవన్‌లను విమర్శిస్తుంటే పవన్, బాలయ్య అభిమానులు మాత్రం కౌంటర్స్ ఇస్తూ రెచ్చిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -