Tuesday, May 21, 2024
- Advertisement -

తమ ఎంపీలుకు విప్ జారీచేసిన వైసీపీ

- Advertisement -

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటంపై తమపార్టీకి మాత్రమే పేటెంట్ హక్కుందని వైసిపి బల్లగుద్ది చెబుతోంది. నాలుగు ఏళ్ళపాటు ప్రజల ముందు డ్రామాలాడిన టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టటం కేవలం ప్రజలను మోసం చేయటమేనని మండిపడుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు తమ ఎంపీలు తప్పనిసరిగా సభకు హాజరుకావాలని ఆ పార్టీ ఈ రోజు విప్ జారీ చేసింది.

మరోవైపు టీడీపీ కూడా తమ ఎంపీలకు నిన్న విప్ జారీ చేసి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించిన విషయం విదితమే. దేశంలోని ఇతర పార్టీల ఆందోళనల కారణంగా టీడీపీ, వైసీపీ పార్లమెంటులో ప్రవేశపెడుతోన్న అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు వీలు కుదరడం లేదు. రేప‌న్న అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తాదా లేకా వాయిదా వేస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -