Monday, May 13, 2024
- Advertisement -

పొట్టి పార్మ‌ట్‌లో రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డ్‌….

- Advertisement -

టీమిండియా తాత్కాలిక స‌ర‌థి రోహిత్ శ‌ర్మ పొట్టి పార్మెట్‌లో మ‌రో రికార్డు సాధించాడు. భార‌త్ త‌రుపున 7వేల‌కు పైగా ప‌రుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా కికార్డు సృష్టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ మాత్రమే ఈ పొట్టి ఫార్మాట్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని దాటారు. శ్రీలంకలో నిన్నటితో ముగిసిన నిదాహాస్ టీ-20 ముక్కోణపు టోర్నీ సందర్భంగా రోహిత్ ఈ ఘనత సాధించాడు.

శ్రీలంక‌లో జ‌రిగిన మూక్కోన‌పు పోటీలో మొద‌ట ఫేవ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన రోహిత్ ఆత‌ర్వాత పుంజుకున్నాడు.కీల‌క‌మైన స‌మ‌యంలో కీల‌క ఇన్నీంగ్స్ లో స‌త్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన రోహిత్ 42 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తద్వారా అతను టీ-20 క్రికెట్‌లో ఏడు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరిపోయాడు.

రోహిత్ శర్మ ఇప్పటివరకు 270 టీ-20 మ్యాచ్‌లు ఆడి 7030 పరుగులు చేశాడు. ఇక సురేశ్ రైనా 275 మ్యాచ్‌లు ఆడి 7378 పరుగులు, విరాట్ కోహ్లీ 228 మ్యాచ్‌లలో 7095 పరుగులు చేశారు. కోహ్లీ-రోహిత్ మధ్య ఉన్న పరుగుల వ్యత్యాసం 65 పరుగులే. ఓవరాల్‌గా చూసుకుంటే పొట్టి ఫార్మాట్‌లో ఏడువేలకు పైగా పరుగులు చేసిన పదో ఆటగాడుగా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -