Thursday, May 2, 2024
- Advertisement -

కళ్యాన్ రామ్ ‘బింబిసార‌’ లుక్ అదుర్స్

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే హరికృష్ణ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లగా.. బాలకృష్ణ మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. హరికృష్ణ తనయులు నందమూరి ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నంద‌మూరి హీరోల్లో హిట్ ఫ్లాపులకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపే కథానాయకుడు క‌ల్యాణ్‌రామ్‌.

హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్ 18వ సినిమాను అధికారికంగా ప్రకటించారు.. తాను హీరోగా నిర్మిస్తూ నటిస్తోన్న చిత్రం ‘బింబిసార’. తాత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేసారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి…క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉంది.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇది కళ్యాణ్ రామ్ కెరీర్‌కు గేమ్ చేంజర్ మూవీ కావడం పక్కా అని తెలుస్తోంది. ‘బాహుబలి’ రేంజ్‌లో ఈ పోస్టర్ కనిపిస్తుండటం విశేషం. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వశిష్ట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ జోడీగా ఇద్దరు హీరోయిన్స్ కేథరిన్‌, సమ్యుక్తా మేనన్‌ నటిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.

Watch: ఓటుకు కోట్లు కేసులో కర్త, కర్మ, క్రియ చంద్రబాబే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -