Wednesday, May 15, 2024
- Advertisement -

అభిమానుల‌కు పండ‌గే….

- Advertisement -
Nandamuri Kalyanram new movie MLA First Look Poster launched

నంద‌మూరి అభిమానుల‌కు ఇక పండుగే. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన ఇజం త‌ర్వాత మ‌రో కొత్త సినిమాను ప్రారంభించారు. ఇందులో ఎమ్మేల్యేగా కొత్త‌సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇది ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఓ పక్క త‌మ్ముడు ఎన్టీఆర్‌తో జై లవకుశ చిత్రాన్ని నిర్మిస్తూనే మరో పక్క సొంత సినిమా ఎంఎల్ఏను వేగంగా పట్టాలెక్కించాడు నందమూరి కల్యాణ్ రామ్. పదేళ్ల తర్వాత కల్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నది. నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ రూపొందిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇటీవల కాజల్ చిత్ర యూనిట్‌తో కలిసింది. ఆమెపై ఇటీవల కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

ఎమ్మెల్యే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్‌కుమార్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. క‌ళ్యాణ్ రామ్ పోస్టర్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌ లుక్ నంద‌మూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త లుక్ లో క‌నిపించ‌నున్నాడు. ఈ ఏడాది చివ‌రిలో ఈ చిత్రం విడుద‌ల కానున్నది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కల్యాణ్ రామ్ యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తుండటం, పుట్టినరోజుకు ఒక రోజు ముందే విడుదల చేయటంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}cG50R8ZejhQ{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -