Friday, May 3, 2024
- Advertisement -

‘అ!’వ‌స‌రాల లుక్ చూశారా

- Advertisement -
  • అష్టాచ‌మ్మ బాయ్స్ బ్యాక్ అంటూ నాని ట్వీట్‌

తొలిసారిగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగిన న్యాచుర‌ల్ స్టార్‌ నాని తాను నిర్మిస్తున్న సినిమా ప్ర‌మోష‌న్స్‌ను విభిన్నంగా చేసేస్తున్నారు. వరుస సినిమా విజయాలతో దూసుకుపోతున్ననాని ఒక్కసారిగా నిర్మాత‌గా అయ్యాయ‌ని షాక్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి షాకుల మీద షాకులిస్తూ త‌న సినిమాను ప్ర‌మోట్ చేస్తున్నాడు.

‘అ!’ అంటూ డిఫ‌రెంట్ టైటిల్‌తో ఆక‌ట్టుకున్న నాని సినిమా అందులో మొద‌ట నిత్యామీన‌న్ ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేశాడు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కు ఇప్పుడు త‌న మొద‌టి సినిమాలో త‌న‌తో పాటు న‌టించిన అవ‌స‌రాల శ్రీనివాస్ ఈ సినిమాలో కూడా న‌టిస్తున్నాడు. అత‌డి లుక్‌ను ఈరోజు విడుద‌ల చేశారు. 24 సినిమాలో సూర్య న‌టించిన పాత్ర మాదిరిగా అవ‌స‌రాల శ్రీనివాస్ క‌నిపిస్తున్నాడు. ఏదో ప్ర‌యోగం చేస్తూ శ్రీను క‌నిపిస్తున్నాడు. ఆయన శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నట్లు ఈ చిత్రం చూస్తుంటే తెలుస్తోంది.

ఈ ఫొటోను నాని ట్వీటర్‌లో విడుద‌ల చేశారు. ‘‘అష్టాచమ్మా’ కుర్రాళ్లు తిరిగొచ్చారు..’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. నాని ఈ చిత్రంలోని ఓ చేపకి, రవితేజ ఓ మొక్కకి వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నారు. ప్రశాంత్‌ వర్మ ఈ సినిమా దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ దాదాపు 80 శాతం పూర్త‌య్యింది. కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, ఈషా రెబ్బా తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు.

 

 

 

https://www.youtube.com/watch?v=IQgbdLUarx4

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -