Sunday, May 5, 2024
- Advertisement -

వైఎస్ హ‌యాంలో అవినీతి జ‌రిగింద‌ని ఆరోపించి ప‌వ‌న్ దాన్ని నిరూపించ‌గ‌ల‌రా…..?

- Advertisement -

వైసీపీ, జ‌నసేన నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు ఘాటైన కౌంట‌ర్లు. ఉత్య‌రాంధ్ర‌ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసిని సంగ‌తి తెలిసిందే. అయితే అంతే ఘాటుగా ప‌వ‌న్‌కు జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్ర‌స్తుతం అనంతపురం జిల్లాలో జ‌గ‌న్ పాదయాత్ర కొన‌సాగుతోంది. విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ పవన్‌పై సుతిమెత్త‌గా విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న‌ది రెండు మూడు రోజుల హ‌డావుడే అని తేల్చేశారు. ప‌వ‌న్ ముందుగా బాబు షెల్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌న్నారు.

పోల‌వ‌రంకు వైయ‌స్సార్‌సీపీ ఎంఎల్ ఏలు, ఎంపీలు వెళుతున్నార‌ని తెలిసే ప‌వ‌న్ కూడా అక్కడికి వెళ్ళారు త‌ప్ప ఆయ‌న‌కు విష‌యం లేదని ఎద్దేవా చేశారు. రెండు మూడు రోజుల హ‌డావుడి త‌ప్ప ఏమీ ఉండదని కూడా జగన్ లైట్ గా తీసుకున్నారు. వైయ‌స్సార్ హ‌యాంలో అవినీతి చోటు చేసుకుంద‌ని ఆరోపించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ దాన్ని నిరూపించగలరా అంటూ సవాలు విసిరారు.

కాంగ్రెస్‌ది అవినీతి పార్టీ అయితే అందులో పీఆర్‌పీని సోదరుడు చిరంజీవి ఎందుకు విలీనం చేశారో చెప్పాల‌ని నిలదీశారు. ఏం అనుభ‌వం ఉన్న‌ద‌ని ఎన్నిక‌ల‌కు ఆరునెల‌ల ముందు ప‌వ‌న్, చిరంజీవి పీఆర్‌పీని ప్రారంభించారని నిలదీసారు. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణను పవన్ ఇపుడు ప్రస్తావించారని కానీ తమ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజ్య‌స‌భ‌లో గతంలోనే ప్రస్తావించారని జగన్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -