Wednesday, May 22, 2024
- Advertisement -

చెత్త ప్రోగ్రామ్స్ చూస్తున్నారా!బిగ్‌బాస్‌పై నాని

- Advertisement -

తెలుగులో బిగ్‌బాస్ సంద‌డి మ‌ళ్లీ మొద‌లైంది.బిగ్‌బాస్‌-2 ఈ నెల 10న మొద‌లు కానుంది.బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌కు వాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,రెండో సీజ‌న్‌కు దూరం అయ్యాడు.త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉండ‌టం వ‌ల్ల బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు తార‌క్ యాంక‌రింగ్ చేయ‌డం లేదు.

ఇక బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని యాంక‌రింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.బిగ్‌బాస్ రెండోవ సీజ‌న్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచేశారు షో నిర్వ‌హ‌కులు.తాజాగా బిగ్‌బాస్‌-2 రెండ‌వ సీజ‌న్‌కు సంబంధించి మీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో నాని కూడా పోల్గొన్నాడు.ఆయ‌న మీడియాతో కొంచెంసేపు ముచ్చ‌టించారు.బిగ్‌బాస్‌కు నన్ను యాంక‌రింగ్ చేయ‌మ‌ని అడిగిన‌ప్పుడు, నేను చేయ‌గ‌ల‌నా అని అనుకున్నాన‌ని కాని అల్లు అరవింద్‌గారు ఇచ్చిన ధైర్యంతోనే నేను ఈ షోకి యాంక‌రింగ్ ఒప్పుకున్నాన‌ని తెలిపారు.

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ మా ఇంట్లో వాళ్లు చూస్తేంటే ప‌ని పాట లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారేంటీ అని తిట్టేవాడినని ఇప్పుడు ఆ షోకే యాంక‌రింగ్ చేస్తున్నానని నాని తెలిపారు.తార‌క్ ద‌గ్గ‌ర కొన్ని స‌ల‌హాలు తీసుకున్నాన‌ని,అవ‌స‌రం అనుకుంటే మ‌ళ్లీ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర టీప్స్ తీసుకుంటాన‌ని తెలిపాడు నాని.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -