Sunday, May 5, 2024
- Advertisement -

అఖిలప్రియ షాకింగ్ డెసిషన్…. బాబుకు హ్యాండ్

- Advertisement -

టిడిపి నాయకులు ఏం ఆలోచిస్తున్నారో ఏమో తెలియదుగానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే నాయకులు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. సాక్షాత్తూ అధినేత సూచనలనే అస్సలు పట్టించుకోకపోవడం….అలాగే అధినేత కార్యక్రమాలకు, పర్యటనలకు హాజరుకాకుండో ఉండిపోవడం లాంటి చర్యలతో చంద్రబాబుకు వరుసగా తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. ఆల్రెడీ అవంతి శ్రీనివాస్ వైకాపాలో చేరడం ఖాయం అన్న వార్తలు ఆంధ్రజ్యోతిలోనే వస్తున్నాయి.

ఇక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డి కూడా బాబుతో కనీసం మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. కర్నూలు జిల్లాలో జరిగిన మినీ మహానాడు, జిల్లా మహానాడుతో పాటు విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా స్వయంగా లోకేష్‌తో సహా ఇతర నాయకులు పిలిచినప్పటికీ రాలేదు. ఇక ఈ రోజు చంద్రబాబు కర్నూలు పర్యటనలో కూడా బీసీ జనార్థనరెడ్డి కనిపించలేదు. జనార్థనరెడ్డి విషయం అలా ఉంటే కర్నూలు జిల్లా నుంచి మంత్రి హోదాలో ఉన్న అఖిలప్రియ కూడా చంద్రబాబు పర్యటనకు హ్యాండ్ ఇచ్చింది. స్వయంగా చంద్రబాబు కోటరీ నుంచే కాల్ చేసి సభకు పిలిచినప్పటికీ అఖిలప్రియ మాత్రం సభకు హాజరుకావడానికి ఇష్టపడలేదు.

మొత్తంగా చూస్తే చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా టిడిపిలో ఉన్న అసంతృప్త నాయకులందరూ కూడా ఇప్పుడు బాబును బేఖాతరు చేస్తున్నారు. వాళ్ళకు నచ్చినట్టుగా బాబు నడుచుకుంటేనే సవ్యంగా ఉంటాం…….. లేకపోతే బాబుకే బొమ్మ చూపిస్తాం అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీలో అధినేతను పార్టీలో ఉన్న ఇతర నాయకులు ఈ స్థాయిలో అవమానించడం మాత్రం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. చంద్రబాబు నాయకత్వ పటిమపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. అసలే ఎన్నికల ఏడాది……… ఆపై 2014 ఎన్నికల్లో మిత్రులయినవాళ్ళతో పాటు కొత్తగా బ్రాహ్మిణులు, ఎస్సీ ఎస్టీలు కూడా పూర్తిగా టిడిపికి శతృవులైన పరిస్థితి. మరోవైపు సొంత పార్టీలో నాయకుల తలనొప్పి. మొత్తంగా చూస్తే టిడిపి పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోందన్న విశ్లేషణలు మాత్రం సర్వత్రా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -