Friday, April 26, 2024
- Advertisement -

నానిని ఆలోచనలో పడిసిన ‘కృష్ణార్జున యుద్ధం’

- Advertisement -

మొన్న‌టి వ‌రుకు హీరో నాని తీసిన ప్ర‌తి సినిమా హిట్టే. కాని నాని తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం నాని స్పీడ్‌కు బ్రేక్ వేసింది.వ‌రుస‌గా ఆరు, ఏడు హిట్లు కొట్టిన నాని, కృష్ణార్జున యుద్ధం సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఒక్క‌సారిగా డీలా ప‌డ్డాడు. కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ కావ‌డంతో నాని రేంజ్ ఏంటో అర్థం అయింది. ఈ సినిమాతో నిర్మాత‌లు బాగా న‌ష్ట‌పొయ్యారు.దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డాడు నాని. గ‌త రెండు సినిమాల నుండి నాని తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు నాని. ఎంసీఎ, నేను లోక‌ల్ సినిమాలు హిట్ అయిన నాని రోటిన్ సినిమాలు చేస్తున్నాడ‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

కృష్ణార్జున యుద్ధం సినిమాలో మాస్ హీరోగా ఎద‌గాల‌ని నాని చేసిన ప్ర‌య‌త్నం ఫెయిల్ అయింది. దీంతో త‌న త‌రువాత సినిమాలపై ఫోక‌స్ పెట్టాడు నాని. వ‌రుస‌గా సినిమాలు ఎనౌన్స్ చేసే నాని ఈ సినిమా త‌రువాత నాగ‌ర్జునతో మ‌ల్టీస్టార‌ర్ త‌ప్ప మ‌రో సినిమా ఫైన‌ల్ చేయ‌లేదు.నాని రోటిన్ క‌థ‌లు కాకుండా భిన్న‌మైన స్టోరీల‌ను ఎంచుకుంటే బాగుంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.నాని కూడా ఆ విధాంగా ఆలోచిస్తేనే బాగుంటుంది. మ‌రి ఈ విష‌యాన్ని నాని తెలుసుకుంటాడో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -