Saturday, April 27, 2024
- Advertisement -

త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన యువ‌రాజ్ సింగ్‌…

- Advertisement -

టీమిండియాకు ఒంటి చేత్తో వరల్డ్ కప్ అందించిన యువరాజ్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. గత ఏడాది జూన్‌లో చివరిసారిగా భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడిన యువీ.. తిరిగి జట్టులోకి రాలేకపోతున్నాడు. ఫిట్‌నెస్ నిరూపించుకోవడం కోసం యో-యో టెస్టులో పాసవడం తప్పనిసరని చెప్పిన మేనేజ్‌మెంట్.. తర్వాత ఆ టెస్టులో పాసైనా.. యువీకి మాత్రం జట్టులో స్థానం కల్పించలేదు. దీంతో అతడి కెరీర్ డైలమాలో పడింది.

అయితే అంత‌ర్జాతీయ క్రికెట్‌నుంచి త‌ప్పుకొనే విష‌యం యూవీ స్పందించారు. యువరాజ్ ఇక క్రికెట్ నుంచి రిటైరవ్వడం ఉత్తమం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని స్పష్టం చేశాడు.

2000లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ప్రారంభించా. దాదాపు 17-18 ఏళ్ల పాటు టీమిండియాకు ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదించాను. ఎన్నేళ్లు క్రికెట్ ఆడినా ఏదో ఓ రోజు రిటైర్ కావాల్సి ఉంటుంది. వచ్చే వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలని భావిస్తున్నాను. అవకాశం వచ్చినా.. రాకున్నా అప్పటివరకూ దేశవాలీ క్రికెట్ ఆడతాక‌న‌ని వెల్ల‌డించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -