Sunday, May 12, 2024
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదాపై కీల‌క నిర్ణ‌యం దిశ‌గ జ‌గ‌న్‌….

- Advertisement -

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, జ‌గ‌న‌సేన‌, వైసీపీ లు ఎవ‌రి వ్యూహాల‌తో వాళ్లు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీలు ప్ర‌త్యోక హోదానే ఎజెండాగా ముందుకెల్తున్నాయి. మొద‌టినుంచి ప్ర‌త్యేక‌హోదాకు మంగ‌ళం పాడిన చంద్ర‌బాబు జ‌గ‌న్ దెబ్బ‌కు ప్ర‌త్యేక‌హోదా నినాదాన్ని అందుకున్నారు.

ఇప్ప‌టికే జ‌గ‌న్ త‌మ పార్టీ ఎంపీల‌చేత రాజీనామాలు చేయించిన సంగ‌తి తెలిసిందే. ఎంపీల రాజీన‌మాలు ప్ర‌భావం చూప‌వ‌ని ప్ర‌త్యేక‌హోదా ఉద్య‌మాన్ని తారాస్థాయికి తీసుకెల్లేందుకు జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణం దిశ‌గా అడుగులు వేస్తున్నారు. తనతో సహా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆదివారం పాదయాత్ర ముగిసిన అనంతరం కృష్ణా జిల్లా అగిరిపల్లిలో ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో జగన్‌ సమావేశమయ్యారు.

ఎంపీలతో రాజీనామా చేయించిన తర్వాత హోదా పోరాటానికి ఊపు వచ్చిందని పేర్కొన్నారు. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దెబ్బతో యూటర్న్ తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే హోదా కోసం జరుగుతున్న ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని మ‌రో ఎమ్మెల్యే అన‌గా మ్మెల్యేల రాజీనామా పెద్ద విషయం కాదని, దశల వారీగా వ్యూహాలను అమలు చేద్దామని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యేలందరం సరైన సమయంలో రాజీనామా చేద్దామని అన్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -