Saturday, May 18, 2024
- Advertisement -

ఈ హిట్ తో నాని కూడా పారితోషకాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లాడు!

- Advertisement -

మొన్నటి వరకూ నాని ఒక్కో సినిమాకు దాదాపుగా కోటి రూపాయల పారితోషకం తీసుకునే వాడు. తన కెరీర్ లో మంచి హిట్లే ఉన్నా.. నాని ఆ స్థాయికి పరిమితం అయ్యాడు.

దీంతో నిర్మాతలకు నాని అందుబాటులో ఉండే వాడు. అంతో ఇంతో ఇమేజ్ ఉంది కాబట్టి కోటి రూపాయల వరకూ ఇవ్వడం తో నిర్మాతలు బయటపడే వారు. అయితే ఇప్పుడు నాని రేంజ్ కూడా పెరిగింది. భలేభటేమగాడివోయ్ సినిమా హిట్ తో నాని పారితోషకాన్ని పెంచేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హీరో ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడని భోగట్టా. ఆ మాత్రం ఇవ్వకపోతే సినిమాకు నో చెప్పేస్తున్నాడని సమాచారం.

మరి ఒక్క సినిమా హిట్ తోనే అంత లా పారితోషకం పెంచేస్తే ఎలా అనేది నిర్మాతల ప్రశ్న. అయితే భలే భలే మగాడివోయ్ సినిమా దాదాపు ఇరవై కోట్ల రూపాయల బిజినెస్ ను చేసింది. దీంతో… నాని తన పారితోషకం స్థాయిని పెంచేశాడు. ఇకపై తన సినిమాకు మార్కటె్ బాగానే ఉంటుంది కాబట్టి… ఆ మాత్రం ఇవ్వడంతో తప్పులేదనేది ఈ హీరో లెక్కగా తెలుస్తోంది. అయితే ఇలా ఒక హిట్ తో పారితోషకాన్ని పెంచేసిన హీరోలు.. ఒక ప్లాఫ్ వచ్చినప్పుడు దెబ్బతినే అవకాశం ఉంది. అయితే నాని మాత్రం ప్రస్తుతానికి అలా ముందుకుపోతున్నాడు.

ఒకవేళ రెండున్నర కోట్ల రూపాయల పారితోషకం ఇవ్వలేకపోతే.. తనకు ఒక ఏరియా హక్కులు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నాడట నాని. మరి మొత్తానికి నాని తన రేంజ్ ను బాగానే పెంచేసినట్టుగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -