Saturday, May 18, 2024
- Advertisement -

రాహుల్ తిట్టేసరికి చిరంజీవి తట్టుకోలేకపోయాడు.. బీజేపీ లోకి జంప్?

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ నేతల్లో అంతో ఇంతో హడావుడి చేస్తున్న రఘువీరారెడ్డిపై ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ లెక్క ఏమిటో కానీ…

రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న చిరంజీవి విషయంలో మాత్రం రాహుల్ కు తీవ్రమైన అసంతృప్తే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో… ఈ మధ్యే రాహుల్ చిరంజీవికి గట్టిగా క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి తిరిగి సినిమాలతో బిజీ అయిపోదామని భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒకింత ఆగ్రహాన్నే వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి వ్యవహారాల గురించి ఎలా తెలుసుకొన్నాడో ఏమో కానీ.. చిరంజీవి విషయంలో రాహుల్ సూటిగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మీరు 150 వ సినిమా మీద నిలుపుతున్నంత శ్రద్ధ కాంగ్రెస్ పార్టీ పనుల మీద పెట్టడం లేదు అంటూ రాహుల్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విధంగా మెగాస్టార్ ను రాహుల్ దెప్పిపొడిచినట్టుగా తెలుస్తోంది. దీంతో చిరంజీవి చిన్నబుచ్చుకున్నాడు. రాహుల్ తో ఇలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదని చిరంజీవి తన సన్నిహితుల వద్దఘాటుగానే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఇదే ఆగ్రహంతో ఆయన తను కాంగ్రెస్ కు తలాక్ చెబుతానని వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది. తను చేరతానంటే చేర్చుకోవడానికి బీజేపీ రెడీగా ఉందని చిరంజీవి భావిస్తున్నాడు.

మరి ఇప్పుడు ఏపీలో బలపడాలని బీజేపీ కూడా తెగ ఆరాటపడుతోంది. దీంతో చిరంజీవి వచ్చి చేరతాను అంటే.. ఆ పార్టీ నేతలు కాదనకపోవచ్చు. ఎలాగూ ఏపీ బీజేపీలో వ్యాక్యూమ్ ఉంది. మరి ఇదే జరిగితే గనుక.. రాజకీయాల్లోకి వచ్చిన ఆరేళ్లలోనే మూడు పార్టీలు మారిన నేతగా చిరంజీవి నిలిచిపోతాడేమో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -