Tuesday, May 14, 2024
- Advertisement -

ఫేస్బుక్లో స్యూ సైడ్ నోట్ … కేసీఆర్ పేరుతో ఝలక్

- Advertisement -

అధికారులు లంచాలకు మగ్గి…అందినకాడికి మింగేసే బకాసురలైతే..ఎంతటి కాంట్రాక్టర్లయినా సరే…లబోదిబో మనాల్సిందే. ఆత్మహత్యలకు పాల్పడాల్సిందే. సరిగ్గా ఇదే విషయం వడ్లమూడి రవికుమార్ విషయంలో జరిగింది.

లంచాలు సమర్పించుకుంటే గాని బిల్లులు మంజూరు చేయమని చెప్పినందుకు విసిగి వేజారిన రవికుమార్…. స్యూసైడ్ నోట్ రాసి ఫేస్ బుక్ లో అధికారులకు పోస్ట్ చేశాడు.దీంతో అధికారులంతా అలర్ట్ అయిపోయి అతనికి మంజూర్ చేయాల్సిన బిల్లులను మంజూరు చేస్తారనుకున్నారంతా.కాని అలా ఏం జరగా లేదు.ఎవరేమనుకుంటే మనకేంటి అనే ధోరణిలో వారున్నారు.

 ఇంతకీ ఇదంతా హైదరాబాద్ లోని చింతల్ వాటర్ వర్క్స్ కార్యాలయంలో జరిగింది.అక్కడి డివిజన్ -12  లో ఓ సెక్షన్ కు అనుబంధంగా వడ్లమూడి రవికుమార్ చిన్న కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు.చిన్నపాటి లీకేజీలకు మరమ్మత్తులు ,5 లక్షల రూపాయల వరకు పైప్ లైన్ పనులు చేస్తుంటాడు.అయితే అతనికి గత మూడేళ్లగా చేసిన పనులకు గాను 8లక్షల రూపాయల వరకు రావల్సిఉంది.దీనికోసమని అతను పలుమార్లు అధికారులను కలిసి బిల్లులు మంజూరుచేయమని కోరగా అధికారులు కేవలం కమీషన్ ఇవ్వలేదనే కారణంతో  రికార్డ్ బుక్ లో బిల్లులు నమోదు చేయబోమని అధికారులు అతన్ని విసిగించారట.లంచాలు ఇవ్వని పాపానికి తనకు బిల్లులు చెల్లించడం

 లేదని రవికుమార్ కలత చెందాడు.అంతే ఆలోచన రావడమే తరువాయి…ఫేస్బుక్ లో అధికారులకు ఇదే విషయంపై పోస్ట్ పంపినా స్పందించకపోవడంతో … సీఎం కే చంద్రశేఖర్ రావు పేషీకి ఓ సందేశాన్ని పంపాడు. అందుల్లో ఒక్క మాటలో విషయాన్ని తేల్చేశాడు. బంగారు తెలంగాణాకు అధికారులే అడ్డుగా మారుతున్నారని పేర్కొన్నారు.దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు.రవికుమార్ బిల్లుల ప్రాసెస్ కు నడుం బిగించారు.చెప్పాల్సిన వాడికి చెబితే తప్పఅధికారులు కదలరని అందరికీ కనువిప్పు చేశాడు. ప్రస్తుతమైతే రవికుమార్ స్యూసైడ్ నోట్ ఎఫ్ బి లో హల్చల్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -