Wednesday, April 17, 2024
- Advertisement -

వేస‌విలో నాని కృష్ణార్జున యుద్ధం

- Advertisement -

త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ వ‌రుస సినిమాల విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచురల్‌ స్టార్‌ నాని 2017లో మూడు విజ‌యాలు అందుకున్నాడు. ‘నేను లోకల్‌’, ‘నిన్ను కోరి’ విజ‌యాల‌తో ఉన్న నానికి ‘ఎంసీఎ (మిడిల్ క్లాస్ అబ్బాయ్‌)’తో మ‌రో విజ‌యం ద‌క్కింది. ప్ర‌స్తుతం నాని త‌న చేతిలో ఉన్న సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు.

మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ‘కృష్ణార్జున యుద్ధం’ అనే సినిమా నాని చేస్తున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2018 ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ట్విటర్‌లో ప్రకటించింది. ఈ సినిమాలో నాని ద్విపాత్రాభిన‌యం చేయనున్నాడ‌ని తెలుస్తోంది. గ‌తంలో జెంటిల్‌మెన్ సినిమాలో ద్విపాత్రాభిన‌యం చేసి విజ‌యం అందుకున్నాడు. మ‌ళ్లీ అలాంటి విజ‌యం నానికి ద‌క్కే అవ‌కాశం ఉంది. కృష్ణార్జున యుద్ధం సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. హిప్‌హాప్ సంగీతం అందిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -