Thursday, May 9, 2024
- Advertisement -

అల్లు హీరోకు తొలి విజయం ద‌క్కే అవ‌కాశం

- Advertisement -

సినిమాలు వ‌రుసగా చేస్తున్న ఆశించిన ఫ‌లితం లేని అల్లు హీరో, తీసిన ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యం పొందిన ద‌ర్శ‌కుడు క‌లిసి సినిమా ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా విభిన్న క‌థాంశంతో వీఐ ఆనంద్ మంచి విజ‌యం అందించాడు. కెరీర్ ప్రారంభం నుంచి ఒక్క విజ‌యం లేక సతమతమవుతున్న అల్లు శిరీశ్ ‘ఒక్క క్షణం’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. త‌న గ‌త సినిమా మాదిరి అదే క‌థాంశంతో కొత్త క‌థ‌తో వీఐ ఆనంద్ వ‌చ్చాడు. ఆ క‌థేంటో చూద్దాం! అల్లు రెండో వార‌సుడికి విజ‌యం ద‌క్కుతుందో లేదో చూడాలి.

కథ :జీవా (అల్లుశిరీష్) పెళ్లి చేయాలని అతడి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. పెళ్లిపై జీవా ఆసక్తి చూపడు. అనుకోకుండా హీరోయిన్ (సురభి)తో పరిచయం ఏర్పడుతుంది. తొలిచూపులోనే ఒకరికొకరు ఆకర్షితులైన వీరు.. ఆ తర్వాత ల‌వ్ బ‌ర్డ్స్‌గా విహ‌రిస్తుంటారు. ల‌వ్ ట్రాక్‌లో ఉండి పెళ్లికి బాట‌లు వేసే స‌మ‌యంలో త‌మ అపార్ట్‌మెంట్ ప‌క్క‌న ఓ జంట దిగుతుంది. వారితో వీరి ప‌రిచ‌యం అవుతుంది. అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్‌ రాకతో ఒక్కసారిగా వీరి మలుపు తిరుగుతుంది. ఈ జంట సురభి ఇంటిపక్కన షిఫ్ట్ అయిన తర్వాత కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. హీరో, హీరోయిన్ల జీవితంలో జరుగుతున్న సంఘటనలు ఇంటి ప‌క్క‌న దిగిన జంట‌కు ఒకే మాదిరి జ‌రుగుతున్నాయి. ఒక‌రితో మరొకరితో ముడిపడి ఉన్నాయని ఆ జంటలు తెలుసుకుంటారు. ఎందుకు అలా జ‌రిగింది? ఏమిటి కార‌ణం? అని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా కొన‌సాగుతుంది.

ఎవ‌రెలా..?:ఇదివరకు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో డిఫరెంట్ థ్రిల్‌నిచ్చిన దర్శకుడు వీఐ ఆనంద్.. ‘ఒక్క క్షణం’తోనూ అదే కిక్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. మొదట్లో కాస్త సినిమాని నడిపించి.. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొక ట్విస్ట్‌తో సీట్లకు అతుక్కుపోయేలా చేశాడు. అతను ఎంచుకున్న ‘పార్లర్ లైఫ్’ కాన్సెప్ట్‌ని చాలా హుందాగా, ఎక్కడ కన్ఫ్యూజన్స్ లేకుండా వెండితెరపై చక్కగా తీర్చిదిద్దాడు.

ప్ల‌స్‌: ఫస్టాఫ్‌లో మొదట కాసేపు సినిమా పరిచయ సన్నివేశాలతో వెళ్తుంది. హీరో, హీరోయిన్ ప్రేమాయణం బాగా కుదిరింది. ఇద్దరి మధ్య లవ్ స్టోరీని కొత్తగా చూపించాడు. ఇక అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్ రాకతో సినిమా మరింత వేగవంత‌మ‌వుతుంది. వీరిద్ద‌రు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. ‘పార్లర్ లైఫ్’ చుట్టూ వచ్చే కొన్ని సీన్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌కు ఎక్క‌డా బోరింగ్ కొట్ట‌కుండా సాగిపోతుంటుంది. అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. దానినే కొన‌సాగిస్తూ సెకాండ‌ఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సినిమా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సినిమా చివ‌ర‌ఖరు డిఫరెంట్‌గానే ఉంది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మూడ్‌లోకి తీసుకెళ్లే విజువల్స్‌తో కెమెరామ్యాన్ ప‌నిత‌నం క‌నిపిస్తుంది. మణిశర్మ పాటలు ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. నిర్మాణం కాస్ట్లీగా క‌నిపిస్తుంది. వీఐ ఆనంద్ తాను అనుకున్న కథను తెర‌పై సరిగ్గా ప‌డేలా చేసుకున్నాడు. ప్రేక్షకుల్ని క‌థ‌లో లీనం చేసేశాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను చూడ‌లేం.

ఓవరాల్‌గా చూస్తే.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా రేంజ్‌లో ఇది పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది కానీ, దాంతో పోల్చకుంటే మాత్రం ఇది బాగానే ఆకట్టుకుంది. ట్విస్టులతో విఐ ఆనంద్ మతి పోగొట్టేశాడు. మధ్యలో కొన్ని ఫ్లాస్ ఉన్నా, వాటిని లైట్ తీసుకుంటే ఈ చిత్రం బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్ని ఆశించే ప్రేక్షకులకి ఇది ఖచ్చితంగా మెప్పిస్తుంది.

గత సినిమాలతో పోలిస్తే.. అల్లు శిరీశ్‌ నటనలో మార్పు చెందాడు. గ‌తం కంటే బాగానే న‌టించాడు. సురభి గ్లామర్ కనిపించింది. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌నే. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అవసరాల శ్రీనివాస్ నటన ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. సీరత్ కపూర్ సోసో అనిపించిన అందాల‌ను ఆరబోసింది.

సినిమా : ఒక్క క్షణం
నటీనటులు : అల్లు శిరీశ్‌, అవసరాల శ్రీనివాస్, సురభి, సీరత్ కపూర్ తదితరులు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : విఐ ఆనంద్
సంగీతం : మణిశర్మ
నిర్మాత : చక్రి చిరుగుపాటి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -