Friday, May 3, 2024
- Advertisement -

నా వేగానికి ఏదైనా ధ్వంసం

- Advertisement -

ద‌గ్గుబాటి రానా వాయిస్ ఓవ‌ర్‌తో ఓ క‌న్న‌డ సినిమా రీమేక్ తెలుగులో రాజ‌ర‌థంగా వ‌స్తోంది. ఆ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. గాలై వస్తాను.. మెరుపై పోతాను.. నాది రాజవంశం.. నా వేగానికి ఏదైనా ధ్వంసం.. నేను నడిచే దారి రాజపథం.. నా పేరు రాజరథం’ అని రానా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు.

రాజరథం చిత్ర ట్రైలర్‌ను రానా విడుద‌ల చేశారు. అనుప్‌ భండారి దర్శకత్వంలో వ‌స్తున్న ఈ సినిమాలో నిరుప్‌ భండారి, ఆర్య, రానా, అవంతిక శెట్టి, రవిశంకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘అనగనగా ఒక వూరిలో.. ఒక కాలేజ్‌లో..’ అంటూ ట్రైల‌ర్ ప్రారంభమ‌వుతుంది. ఇలా కొన‌సాగుతున్న ట్రైలర్‌ ఒక్కో పాత్రను పరిచయం అవుతుంటుంది. హీరో ఆర్య పాత్ర విభిన్నంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. విల‌న్ పాత్ర‌లో న‌టించిన‌ట్లు తెలుస్తోంది. రానా ఈ సినిమాలో కేవ‌లం ఓ బ‌స్సుకు వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు.అంద‌మైన తీరాలు, లోక‌ష‌న్ల‌తో సినిమాను తెర‌కెక్కించారు. ఆహ్లాద‌క‌రంగా సాగేలా ఈ సినిమా క‌నిపిస్తోంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -