Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హేష్ బాబుని వెన‌క్కి నెట్టిన నాని

- Advertisement -

అవును మీరు విన్న‌ది నిజ‌మే.సూప‌ర్‌స్టార్ తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమా,అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు రెడీ అవుతుంది.నాని సినిమా కొత్త సినిమా కృష్ణార్జున యుద్ధం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ పూర్తి చేసుకుని విడ‌ద‌ల‌కు సిద్ధంగా ఉంది.నాని కృష్ణార్జున యుద్ధం ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో మొత్తం 33 లక్షల మందికిపైగా ఈ ప్రచార చిత్రాన్ని చూశారు. మొత్తం 59 వేల మంది ట్రైలర్‌ను లైక్‌ చేశారు.

ఇప్పటికీ ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉండటం విశేషం. మొన్న‌టి వ‌ర‌కు యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మ‌హేష్ బాబు భ‌ర‌త్ అను నేను టైటిల్ సాంగ్ మొద‌టి స్థానంలో ఉంది.ఇప్ప‌డు నాని ట్రైల‌ర్ వ‌చ్చి మ‌హేష్ సాంగ్‌ని రెండ‌వ స్థానానికి ప‌రిమితం చేశాడు.మ‌హేష్ బాబు భ‌ర‌త్ అను నేను .. భ‌ర‌త్ విజ‌న్ అంటు చిన్న వీడియోని విడుద‌ల చేశారు. ఆ వీడియో మోస్ట్ వ్యూస్‌ అండ్ లైక్డ్ వీడియోగా వ‌ర‌ల్డ్‌లో రెండ‌వ స్థానంలో ఉంది.ఏమైన‌ప్ప‌టికి మ‌హేష్‌ని వెన‌క్కి నెట్టి నాని మొద‌టి స్థానంలో నిల‌వ‌డం అంటే మాములు విష‌యం కాదు క‌దా!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -