Saturday, May 4, 2024
- Advertisement -

అధికారికంగా చెప్పేసిన జేడీ…. జగన్ వ్యతిరేక వైఖరి కూడా బయటపెట్టేశాడు

- Advertisement -

నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ……. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలు తనను ఘనంగా ఆదిరస్తున్నారని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. కానీ చంద్రబాబు చరిత్రలోనే సొంతంగా గెలిచిన గెలుపు ఒక్కటి కూడా లేదు. ఎన్టీఆర్‌ నుంచి పదవి లాక్కున్నతర్వాత ఎన్నికల్లో వాజపేయి కార్గిల్ విజయం పుణ్యమాని గట్టెక్కాడు. ఇక ఆ తర్వాత మోడీ మేనియాను క్యాష్ చేసుకున్నాడు. పవన్‌లాంటి నటనాయకుడి క్రేజ్ వాడుకున్నాడు. ఇంతా చేస్తే జగన్‌కంటే చంద్రబాబుకి ఎక్కువ వచ్చిన ఓట్లు కేవలం 5లక్షల చిల్లర.

ఇక 2019 ఎన్నికలకు మోడీతో కలిసి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపికి కూడా డిపాజిట్స్ దక్కకుండా చేస్తారని ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చేసిన నేపథ్యంలో మోడీకి ఝలక్ ఇస్తూ బిజెపికి రాంరాం పలికాడు చంద్రబాబు. అయితే విభజనకు కారణమైన బిజెపితో 2014లో కలిసింది….. ఇప్పుడు విడిపోయింది కూడా రాష్ట్రం కోసమే అంటాడు చంద్రబాబు. ఆ విషయం ఎలా ఉన్నా 2019ఎన్నికల్లో జగన్‌ని సొంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అందుకే ఇప్పటి నుంచే ఎన్నికల్లో తనకు సాయపడడానికి కొంతమందిని రెడీ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిండా ముంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా మోసం చేసిన అశోక్ బాబు రెడీగా ఉన్నాడు. ఇక సీట్ల బేరం కుదరక బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా 2019ఎన్నికల తర్వాత చంద్రబాబు మనిషే అవుతాడన్నది నిజం. ఇక జెపిలాంటి వాళ్ళు ఎలాగూ ఉండనే ఉన్నారు.

అయితే 2019 ఎన్నికలకు జేడీ లక్ష్మీనారాయణను కూడా రంగంలోకి దించుతున్నాడు చంద్రబాబు. తాజాగా మీడియాతో మాట్లాడిన జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశాన్ని ధృవీకరించాడు. 2014ఎన్నికల్లో టిడిపి టిక్కెట్ ఆశించాడు ఈ లక్ష్మినారాయణ. అయితే అలా చేస్తే జగన్‌కి ప్లస్ అవుతుందన్న ఆలోచనతో జెడీకి టికెట్ నిరాకరించాడు చంద్రబాబు. అయితే ఈ సారి మాత్రం చాలా తెలివిగా జెడీని జనసేన తరపు నుంచి కానీ, లేక సొంత పార్టీ స్థాపించి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నాడు. ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో…… రాజీనామా పర్వం అయ్యాక చెప్తానన్నాడు జేడీ. ఒకసారి పాలిటిక్స్‌లోకి అధికారికంగా వచ్చిన వెంటనే జేడీ చెప్పబోయే విషయాలు ఏంటో క్లారిటీ ఇచ్చాడు. జగన్‌తో సహా అవినీతిపరులు అందరినీ శిక్షించాలనుకున్నా…….. కానీ రాజ్యాధికారంలో లేక ఫెయిల్ అయ్యా……… ఒకసారి అధికారం ఇచ్చి చూడండి……. అవినీతిని పూర్తిగా అంతమొందిస్తా అనేదే జేడీ ఫస్ట్ డైలాగ్. ఇక ఈ మాటను బాబు భజన మీడియా అంతా కూడా ఏ స్థాయిలో గొప్పగా ప్రచారం చేస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి ఎన్ని గిమ్మిక్స్ చేసినా 2019 ఎన్నికల్లో ప్రజలు మరోసారి బాబును గెలిపించే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయి. బాబుకు కూడా ఈ విషయంపై స్పష్టత ఉందట. అందుకే జేపీ, పవన్, జేడీలాంటి వాళ్ళతో వ్యూహాలు రచించి 2019 ఎన్నికల తర్వాత మెజార్టీ దక్కకపోయినా అందరి సపోర్ట్‌తో మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాడు చంద్రబాబు. 2019లో కూడా బాబు వ్యూహాలు, అబద్ధపు హామీలు ఫలించి మరోసారి అధికారాన్ని అప్పగిస్తాయా? లేకపోతే పార్టీ పెట్టిన మరుక్షణం నుంచీ ప్రజల మధ్యనే ఉంటూ……ప్రజల కోసం పాటుపడుతున్న జగన్‌కి అధికారం దక్కుతుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -