Sunday, May 5, 2024
- Advertisement -

16న ఓరుగ‌ల్లులో ఎంసీఏ ప్రీ రిలీజ్

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న చిత్రం మిడిల్ క్లాస్ అబ్బాయ్ `ఎంసీఏ`. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టే్శ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్‌, ల‌క్ష్మ‌ణ్ నిర్మాత‌లుగా వ్య‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబ‌ర్ 16వ తేదీన వ‌రంగ‌ల్ గ‌డ్డ మీద నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

డ‌బుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంభంలో త‌మ బ్యాన‌ర్‌లో `నేను లోక‌ల్‌` సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివ‌ర‌లో `ఎంసీఏ` సినిమాతో మ‌రో హిట్‌ను సాధించ‌బోతున్నాడని నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించారు. ఈ సినిమా స‌క్సెస్‌తో మా బ్యాన‌ర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌నే కాన్ఫిడెంట్‌తో ఉన్నట్లు చెప్పారు.

వ‌దిన‌, మ‌రిదిల మ‌ధ్య అనుబంధం గురించి తెలిపే సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్ (ఎంసీఏ)’ ఉండ‌నుంద‌ని తెలిసిందే. ఈ సినిమా డిసెంబ‌ర్ 21వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈనెల‌లో నాని సినిమా గురించే టాకంతా. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ కూడా నాని సినిమాతో మంచి వ‌సూళ్లు సాధించాల‌ని ఆశిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -