Monday, May 6, 2024
- Advertisement -

త‌లైవా కాలా రెండో లుక్‌

- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా కాలా సినిమా రెండో లుక్ విడుద‌ల చేశారు. లుక్‌ను విడుద‌ల చేస్తూ ర‌జ‌నీకాంత్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. రియ‌ల్టీ ర‌జినీకాంత్‌, సినిమాల‌కు వేర్వేరుగా ఉంటారు. యువ దర్శకుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ కాలాగా వ‌స్తున్నాడు. ఈ సినిమా ‘కాలా’లోనూ రజినీ తన ఒరిజినల్‌ లుక్‌తోనే కనిపిస్తున్నాడు. కొన్నినెల‌ల కింద‌ విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్ త‌ర్వాత మ‌ళ్లీ సెకండ్ లుక్‌ను ఈ రోజు (డిసెంబ‌ర్ 12)న విడుద‌ల చేశారు. ర‌జ‌నీ క్లోజప్‌తో సెకండ్ లుక్ వదిలారు.

మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కూడా చాలా రియలిస్టిగ్గా సాగుతుందట. రజినీ అల్లుడు ధనుశ్ వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా 2018 ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంద‌ట‌. ఈ లుక్‌లో కళ్లద్దాలు పెట్టుకుని కోపంగా చూస్తున్న స్టిల్‌ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వండర్‌ బార్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై రజనీ అల్లుడు ధనుష్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం ముంబాయిలో సినిమా తొలి భాగం షూటింగ్ పూర్త‌య్యింది. మిగ‌తా షూటింగ్ చెన్నైలో చేస్తున్నారు. రజనీ మ‌రో సినిమా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‘2.ఓ’ చేస్తున్నారు. ఈ సినిమాను 2018 ఏప్రిల్‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -