Tuesday, April 30, 2024
- Advertisement -

బాలయ్యా……. ఆర్తనాదాలు మొదలయ్యాయయ్యా? ఈ సారైనా ముందుగా మేల్కొంటావా?

- Advertisement -

యువ హీరోల కంటే ఫాస్ట్‌గా సినిమాలు చేస్తున్నాడు బాలకృష్ణ. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద అత్యంత ఫాస్ట్‌గా సినిమాలు చేస్తున్న నానీతో సమానంగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాకు దాదాపు పదికోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. సూపర్…..బంపర్……..ఈ వయసులో కూడా ఈ స్థాయి ఎనర్జీతో వర్క్ చేయడం అంటే మామూలు విషయం కాదు అని మీడియా కూడా బాలయ్య బాబు భజన ఓ స్థాయిలో చేస్తోంది. అయితే మరోవైపు బాలయ్య చెవులకు చేరాల్సిన కొన్ని ఆర్తనాదాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధాన మీడియా సంస్థలన్నీ కూడా టిడిపి చేతిలోనే ఉండడంతో ఆ గొంతులు వినిపించడం లేదు కానీ లక్షల మంది ప్రజలు ఈ సారైనా బాలయ్య ఏమైనా చేయకపోతాడా అని ఎదురు చూస్తున్నారు.

గత సంవత్సరం వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల కంటే అనంతపురం జిల్లాలో ఉన్న హిందూపురం నియోజకవర్గమే వార్తలో ప్రముఖంగా నిలిచింది. అభివృద్ధి కార్యక్రమాలతో కాదు……ప్రజల ఆర్తనాదాలతో. ఆ సమయంలో బాలయ్య బాబు మాత్రం ఎంచక్కా ఫారెన్ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. తీరా సమ్మర్ అయిపోయే సమయానికి ముందుగా తెలిసి ఉంటే బాలయ్య ఏమైనా చేసి ఉండేవాడు. ప్రజల కష్టాలు తీర్చేవాడు అని ఎల్లో మీడియాలో కవరింగ్ వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి చాలా ముందుగానే అక్కడి ప్రజలు మేల్కొన్నారు. గట్టిగా ఫిబ్రవరి మొదలయ్యేసరికి అనంతపురంలో నీటి కొరత ఉధృతమవుతుంది. మరి ఈ సారైనా బాలయ్య బాబు ముందుగా మేల్కుంటాడా? లేకపోతే సాకులు చెప్పి తప్పించుకుంటారా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రతను పరిశీలిస్తే వేసవి కూడా ఇంతే తీవ్రస్థాయిలో ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. సైన్స్ విజ్ఙానం కూడా అవసరం లేదు. ఆ స్థాయి తీవ్ర వేసవిని ఎదుర్కోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటోందా? ఎద్దులపైన బాలయ్య పేరు రాసి ఊరేగించాల్సిన అవసరం అక్కడి ప్రజలకు లేకుండా ఈ సారైనా బాలయ్య ఏమైనా చేస్తాడా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -