Friday, May 17, 2024
- Advertisement -

ఆ ద‌ర్శకుడితో మూడోది అంటున్న నాని

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నానిని ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టిన సినిమా అంటే అష్టాచ‌మ్మా సినిమా అనే అంద‌రు చెబుతారు.అష్టాచమ్మా సినిమాకు ద‌ర్శ‌కుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.మ‌రి త‌న‌కు మొద‌టి హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడితో నాని రెండో సినిమా చేయ‌డానికి చేయ‌డానికి దాదాపు 8 సంవ‌త్స‌రాల‌పైనే ప‌ట్టింది.వీరిద్ద‌రి కాంబినేషన్‌లో వ‌చ్చిన మ‌రో సినిమా జెంటిల్‌మ‌న్. జెంటిల్‌మ‌న్ సినిమాతో వీరిద్ద‌రు మ‌రో హిట్ కొట్టారు.అయితే ఇంద్రగంటి మోహనకృష్ణ నానితో త్వరలో మరో సినిమా చేసే అవకాశం ఉందని స‌మాచారం.

ఈ ఇద్దరి కాంబోలో సినిమా రావొచ్చని గత ఏడాదే వార్తలు వచ్చాయి కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో ఆలస్యమవుతూ ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. నాని ప్ర‌స్తుతం నాగ‌ర్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాతో పాటు క్రికెట్ నేప‌థ్యంలో జెర్సీ అనే మ‌రో సినిమా చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అయిన త‌రువాత ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమాను లైన్లో పెడ‌తాడ‌ని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -