Sunday, May 19, 2024
- Advertisement -

సాఫ్ట్ వేర్‌గా విజ‌య్ దేవ‌రకొండ‌

- Advertisement -

అర్జున్ రెడ్డి ఒక్క సినిమాతో ఒవ‌ర్‌నైట్ స్టార్ హీరో అయ్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమాతో మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగింది.ఎంత‌లా అంటే ఫిలింఫేర్ అవార్డ్స్‌లో చిరంజీవి,బాల‌కృష్ణ‌,ప్ర‌భాస్ వంటి హీరోల‌ను కాదని మ‌నోడికి బెస్ట్ హీరో అవార్డు వ‌చ్చిందంటే విజ‌య్ త‌న న‌ట‌న‌తో ఎలా మాయ చేశాడో అర్థం చేసుకోవ‌చ్చు.ఇక ఇప్ప‌టికే విజ‌య్ చేతిలో ఓ అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి.తాజాగా ఆయన మరో సినిమాకి ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆయన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం.యేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై దర్శకుడు క్రాంతిమాధవ్ గతంలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా చేశాడు. . అలాంటి ఈ కాంబినేషన్లోనే మరో ప్రాజెక్టు సిద్ధం కాబోతోంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండను తీసుకున్నారు. ప్ర‌స్తుతం హీరోయిన్ వేట‌లో ఉన్నారు ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -