Monday, April 29, 2024
- Advertisement -

త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌కు స్పందించిన నాని

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.మ‌రో రెండు వారాల‌లో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ముగియ‌నుంది.సీజ‌న్ మొత్తం ఆక‌ట్టుకున్న బిగ్‌బాస్‌,చివ‌రికి వ‌చ్చేసారికి విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంది.ప్రేక్ష‌కులు బిగ్‌బాస్ పైనే కాకుండా హౌస్ట్‌గా వ్య‌వహరిస్తున్న నానిపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.ఇది స్క్రిప్ట్ గేమ్ అని.. తమకు నచ్చిన వారినే బిగ్ బాస్ విజేతగా ప్రకటించనున్నారని దానికి హోస్ట్ నాని కూడా సపోర్ట్ చేస్తున్నాడని అంటున్నారు.

తాజాగా దీనిపై స్పందించాడు న్యాచుర‌ల్ స్టార్ నాని. బిగ్‌బాస్‌కి సంబంధించి కొన్ని కామెంట్స్ చూశాను. నేను మీకు స్పందించాల్సిన అవసరం లేదని బిగ్ బాస్ టీం నాకు చెప్పినప్పటికీ స‌మధానం ఇవ్వకుండా ఎలా ఉండగలను. ఇదే షోకి సంబంధించి నా చివరి ప్రకటన అంటూ ఓ పోస్ట్ పెట్టాడు నాని. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టమైన హౌస్‌మెట్‌ని ఎప్పుడు ప్రత్యేకంగా చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ హోస్ట్‌గా నేను మీలా ఆలోచించలేను. నా వైపు నుండి అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. మీరు హౌస్‌లో ఒకరికి అభిమాని అయి ఉండొచ్చు అయితే నేను హౌస్ లో అందరికీ సమానంగా ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీకు నేను పక్షపాతం చూపిస్తున్నానని అనిపించొచ్చు.

కానీ నన్ను నమ్మండి నాకు హౌస్ లో అందరూ సమానమే. మీ ఆదరణతోనే హౌస్ లో ఉత్తమ వ్యక్తి విజయం సాధిస్తారు. ఎలిమినేష‌న్ విష‌యంలో నా ప్ర‌మేయం ఏం ఉండ‌ద‌ని తెలిపాడు నాని.నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు బెస్ట్ ఇవ్వాలనేది నా ఆలోచన.ఇక ఆ విషయాన్ని మీకే వదిలేస్తున్నాను అంటు,ఇదే బిగ్‌బాస్‌కు సంబంధించిన నా చివ‌రి పోస్ట్ అని ముగించాడు నాని.గ‌త వారం ఎక్కువ ఓట్లు వ‌చ్చిన నూత‌న్ నాయుడు సేవ్ చేయ‌కుండా అమీత్‌ను సేవ్ చేసి , నూత‌న్ నాయుడుని ఎలిమినేట్ చేయ‌డం ద్వారా ఈ ట్రోల్స్ మొద‌లైయ్యాయి.దీనిపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.మ‌రి నాని వివ‌ర‌ణ‌పై బిగ్‌బాస్ ప్రేక్ష‌కులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -