Sunday, May 5, 2024
- Advertisement -

కౌషల్ ఆర్మీపై స్టింగ్ ఆపరేషన్ !

- Advertisement -

బిగ్ బాస్ 2 తెలుగు సీజన్ మొదటి మూడు వారాలు బాగానే సాగింది. ఆ తర్వాత నుంచి షో మొత్తం ఏకపక్షంగా మారిపోయింది. అందుకు కారణం కొందరు హౌస్ మేట్స్ గ్రూప్స్ కట్టడం. కౌషల్ ను ఒంటరి చేసి వేధించడం. అయినదానికీ కానిదానికీ అతడిని టార్గెట్ చేసి మానసికంగా హింసించడం. కిరీటి, భానుశ్రీ, తేజశ్వి, నందిని, గోగినేని, దీప్తి సునైనా, గణేశ్ కౌషల్ ను టార్గెట్ చేశారు. గ్రూపులు కట్టి మరీ, అతడిని ఏకాకిని చేసి ఆటాడుకున్నారు. వీరి కుట్రలు, కుతంత్రాలు, చీప్ ట్రిక్స్ అన్నీ గమనించిన బిగ్ బాస్ ప్రేక్షకులు కౌషల్ కు మద్దతుగా నిలిచారు. నీతి నిజాయతీతో ముక్కుసూటిగా ఆడుతున్న అతడికి చాలామంది అభిమానులైపోయారు. కౌషల్ ఆర్మీ పేరుతో అభిమానులు ఏకమై ఆయనకు అండగా నిలిచారు. ప్రతివారం ఎలిమినేషన్ కోసం జరిగే ఓటింగ్ లో ఓ ఉద్యమంలా వీళ్లంతా పాల్గొంటున్నారు. కౌషల్ ను వేధించిన వాళ్లు నామినేట్ అయితే వారికి తక్కువ ఓట్లు పడేలా ఓటింగ్ లో పాల్గొంటూ వారు ఎలిమినేట్ అయ్యేలా కృషి చేశారు. దాని ఫలితంగానే కిరీటి, భానుశ్రీ, తేజశ్వి, నందిని, గోగినేని, దీప్తి సునైనా, గణేశ్ ఏడుగురు ఎలిమినేట్ అయిపోయారు. కౌషల్ నామినేట్ అయితే ఊహించని రీతిలో అతడికి కోట్ల ఓట్లు వేసి ప్రధమ స్థానంలో ఉంచుతున్నారు. ఒక్కో వారం రికార్డ్ స్థాయిలో 16, 17 కోట్ల ఓట్లు వరకూ కౌషల్ కు వేస్తూ కౌషల్ ఆర్మీ తమ అభిమానం చాటుకుంటోంది.

అయితే కౌషల్ ఆర్మీ అభిమానం, కౌషల్ గెలుపు కోసం వాళ్లు చేస్తున్న యుద్ధం గురించి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాక తెలుసుకున్న పలువురు కంటెస్టెంట్లు ఆ అభిమానాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఫేక్ ఆర్మీ. పెయిడ్ ఆర్మీ అని బురద జల్లారు. పలు ఆంగ్ల వెబ్ సైట్స్ లో కౌషల్ ఆర్మీకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాయించారు. ఇంకా వారి కసి, పగ, కోపం చల్లారక ఇప్పుడు ఏకంగా కౌషల్ ఆర్మీ మీద స్టింగ్ ఆపరేషన్ చేయించడానికి సిద్ధమయ్యారని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కౌషల్ సతీమణి నీలిమ వద్దకు ఓ తెలుగు టీవీ చానెల్ తరఫున కొంతమందిని పంపించాలని స్కెచ్ వేశారు. ఎలిమినేట్ అయన వారిలో ఓ పెద్దమనిషి ఈ స్కెచ్ కు దర్శకత్వం వహిస్తున్నారు. సదరు చానెల్ న్యూస్ ప్రజెంటర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సీక్రెట్ కెమేరాలు, మైకులు పెట్టుకుని నీలిమ వద్దకు వెళ్లి, మేడమ్ మేము కౌషల్ ఆర్మీ నుంచి వచ్చాం. మేం కౌషల్ అన్నకు అభిమానులం. ఫైనల్స్ దగ్గరపడుతున్నాయి. అన్నకు టఫ్ కాంపిటీషన్ ఎదురవుతోంది. పెద్ద ఎత్తున ఇతర కంటెస్టెంట్లకు ఓట్లు వేసేందుకు పలు సాఫ్ట్ వేర్ కంపెనీలతో మాట్లాడుకున్నారు. మీరు కూడా డబ్బులు ఇస్తే మేం ఒక్కొక్కరం వెయ్యికి పైగా మెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసి, లక్షల ఓట్లు వేస్తాం..అని నీలిమను అడగాలని ప్లాన్ వేశారు. ఆమె భర్త గెలుపు కోసం పొరపాటున ఏమైనా డబ్బులు ఇస్తే, సీక్రెట్ కెమేరాలతో షూట్ చేసిన, ఆ వీడియోలను తెచ్చి, సదరు చానెల్ లో రోజంతా ప్రచారం చేసి, కౌషల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ…అని ప్రచారం చేయాలనేది సదరు పెద్ద మనుషుల కుట్రగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ఆద్య న్యూస్ కి తెలిసింది. సో కౌషల్ ఆర్మీ బీ కేర్ ఫుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -