నాని ట్విట్టర్ కొత్త ప్రొఫైల్ పిక్చర్

Nani Reveals a Mass look From Dasara Movie
Nani Reveals a Mass look From Dasara Movie

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలకు రెడీ అవుతోంది. పాన్ ఇండియా సినిమా ‘దసరా’లో రోజువారీ కూలీగా తన పాత్ర కోసం అద్భుతమైన మేక్ఓవర్ అయ్యారు నాని. ఇటీవల మేకోవర్‌కి అసలైన అర్థం చెప్పారు నాని. ఒక నటుడు తాను పోషించే పాత్రలో యాప్ట్, రియల్ గా కనిపించేలా తనను తాను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అద్భుతంగా చూపించారు నాని.

ఆయితే నాని ట్విట్టర్‌లో తన ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. గజిబిజి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్‌లో మీసాలు తిప్పుతూ అబ్బురపరిచేలా కనిపించారు నాని. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చూడని మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 30న దసరా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని సినిమాని బలంగా ప్రమోట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read

NTR30 ముహూర్తం ఫిక్స్..? ఎప్పుడంటే..?

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?