- Advertisement -

NTR30 ముహూర్తం ఫిక్స్..? ఎప్పుడంటే..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏడాది క్రితమే అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ పై రకరకాల పుకార్లు షికారు చేశాయి. కథలో కొరటాల చాలా మార్పులు చేశాడని, కాదు కాదు.. పూర్తిగా కథనే మార్చి మరో కొత్త కథ సిద్దం చేస్తున్నాడని.. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ రావడంతో తారక్ అభిమానులు ఊపిరి పిల్చుకున్నారు.

ఎన్నో రోజులుగా అభిమానులను ఉరిస్తున్న NTR30 ఫిబ్రవరి 24న జరగనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం నందమూరి ఇంట విషాదం చోటుచేసుకోవడంతో వాయిదా వేశారు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఓ ఫోస్ట్ వైరల్ అవ్వుతుంది. ” ఫిబ్రవరి 30న ఉదయం 9.10 గంటలకు….???? రామోజీ ఫిలిమ్ సిటీ లో ముహూర్తం ఫిక్స్ అయిందని… ముఖ్య అతిథులుగా ప్రభాస్, ఎస్ ఎస్ రాజమౌళి మరియు ప్రశాంత్ నీల్…..??? వస్తున్నట్లు…” . అయితే ఇక్కడ ”’ఫిబ్రవరి 30న”’ ఇదే హైలెట్.

ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్మాల్ టీజర్ ను ఆ మద్య రిలీజ్ చేసి చిత్రయూనిట్ పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇక ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే విలన్ గా సైఫ్ అలీఖాన్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఈ వార్తలను చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీలో స్టోరీ పరంగా తండ్రి కొడుకుల పాత్రలలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట.

Also Read

సై అంటున్న రామ్ చరణ్, అల్లు అర్జున్ ?

అక్కినేని హీరోలకు స్టార్ డమ్ వస్తుందా ?

మెగాస్టార్ పూరీ కాంబినేషన్ ఫిక్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -