Wednesday, May 15, 2024
- Advertisement -

నానీ కీ నితిన్ కీ కలిసొచ్చింది

- Advertisement -

మే చివరి వారం లో విడుదల అయిన నితిన్  – త్రివిక్రమ్ ల సినిమా ‘ అ ఆ ‘ .. జూన్ మొదటి వారం లో విడుదల అయిన జెంటిల్మెన్ సినిమా తప్ప ఇంక ఏ సినిమాలూ ప్రస్తుతం థియేటర్ లలో మంచి రన్ పొందడం లేదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతున్న ఈ రెండు సినిమాలూ దేశీ మార్కెట్ లో మాత్రమే కాక ఓవర్ సీస్ లో కూడా దుమ్ము దులిపెస్తున్నాయి. ఇప్పటికే మూడవ వారం కంప్లీట్ అవుతూ ఉండగా అ ఆ సినిమా అక్కడ  2.4 మిలియన్ డాలర్లు (సుమారు 16.33కోట్ల రూపాయలు) వసూలు చేసి తెలుగులో ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ తర్వాతి స్థానాన్ని సొంతం చేసుకుంది.

నానీ జెంటిల్మెన్ గా రావడం తో ఓవర్ సీస్ లో వారం అంతానికే ఆరొందల  భై వేల డాలర్లు వచ్చేసాయి. ఈ వారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడం జెంటిల్‌మన్‌కు కలిసొచ్చే అంశం. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్‌మన్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -