Monday, May 20, 2024
- Advertisement -

ఆంధ్రా నే మాకు కావాలి అంటున్న ” హీరో “

- Advertisement -

తెలుగు రాష్ట్రాలు తెలంగాణా – ఏపీ రెండూ విడి విడిగా విడిపోయిన తరవాత కాలం లో రెండు ప్రభుత్వాల మధ్యన, రెండు రాష్ట్రాల మధ్యనా అన్ని విషయాల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది.

ఇప్పుడు అది పారిశ్రామిక సంస్థల ఆకర్షణలో కూడా పోటిగా మారింది. ఒక్కొక్కసారి ఏపీ గెలిస్తే మరొక సారి తెలంగాణా గెలవడం పరిపాటి గా మారింది. ఇప్పుడు హీరో మోటో కార్ప్ ఏర్పాటు విషయం లో ఆ కాంట్రాక్ట్ ని దక్కించుకోవడం లో ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం సక్సెస్ అయ్యింది అని చెప్పాలి. తెలుగు నెల మీద మొదటి నుంచీ ప్లాంట్ ఏర్పాటు చెయ్యడం కోసం ఆసక్తి చూపిస్తున్న హీరో మోటో కార్ప్ యాజమాన్యం మొదట తెలంగాణా సర్కారు ని సంప్రదించింది.

ఈ క్రమంలో ఆ సంస్థకు రెడ్ కార్పెట్ పరచిన తెలంగాణ సర్కారు హైదరాబాదు సమీపంలోని మెదక్ జిల్లాలో స్థలం కేటాయింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కానీ ఆ సంస్థ మాత్రం తన నిర్ణయం మార్చుకుని ఏపీలోకి ఎంటరైంది. రాయతీల విషయం లో తెలంగాణా కంటే ఏపీ లోనే భారీ అవకాశాలు ఉండడం దీనికి కారణంగా చెబుతున్నారు. భూమి ఇవ్వడం తో పాటు రాయతీలు కూడా ఇవ్వడానికి మోటో కార్ప్ కి ఏపీ సహకారం అందించడం తో సీన్ రివర్స్ అయ్యింది, మొదట తెలంగాణా సర్కారు కూడా ఇచ్చిన భూమిని వెనక్కి ఇచ్చేసిన హీరో కార్ప్ ఇప్పుడు ఏపీ వెంట పడుతోంది.

ముఖ్యంగా సాఫ్టువేర్ కంపెనీల విషయంలో తెలంగాణది పైచేయి అవుతున్న తరుణంలో ఏదైనా ప్రధాన కంపెనీని ఏపీకి రప్పించాలని చంద్రబాబు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే హీరోసంస్థకు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య రాయితీల విషయంలో సంప్రదింపులు కొలిక్కి రావడంలేదన్న సమాచారం అందగానే ఏపీ తరఫున అధికారులు ఎంటరై ఆఫర్లతో ‘హీరో’ ను సంప్రదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -