Monday, May 13, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌కు నాని పేక‌ప్ చేప్పేశాడా..?

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ నిన్న‌టి(ఆదివారం)తో ముగిసింది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు హౌస్ట్‌గా నాని వ్య‌వ‌హరించిన సంగ‌తి తెలిసిందే.16 మంది కంటెస్టెంట్లుతో మొద‌లు పెట్టిన ఈ షో , 16 వారాల పాటు సాగింది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌టి నుంచి వివాదాల‌తోనే సాగింది.హౌస్‌మెట్స్ మ‌ధ్య ఏదో గొడ‌వ‌లు నిత్యం జ‌రుగుతుండేవి.దీంతో హౌస్ట్‌గా నాని ఇంటి స‌భ్యుల‌తో కాస్తా క‌ఠ‌నంగానే ఉండేవాడు.దీని కార‌ణంగా నాని విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన్నాడు. కొంద‌రు సోష‌ల్ మీడియా వేధిక‌గా నానిని ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు.అత‌ని సినిమాల‌ను కూడా చూడ‌వ‌ద్దు అని కొంద‌రు ప్రచారం చేశారు.

నాని అన‌వ‌స‌రంగా బిగ్‌బాస్ షో ఒప్పుకుని తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్నాడ‌ని మ‌రికొంద‌రు భావించారు.ఏది ఏమైతేనేం నాని బిగ్‌బాస్‌ని ఘ‌నంగా ముగించాడు.అయితే బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌ను కూడా నానినే హౌస్ట్‌గా చేయ‌ల‌ని బిగ్‌బాస్ టీం కోరింద‌ట‌.కాని నాని వారి కోరిక‌ను తిరస్క‌రిచడ‌ట‌.అసలు నాని బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్త‌నికి హౌస్ట్‌గా చేయ‌డానికి రాలేద‌ట‌.రెండు వారాలు చేస్తే చాలు అని చెప్పి బిగ్‌బాస్ టీం నానిని హౌస్ట్‌గా ఒప్పించార‌ట‌.తీరా చూస్తే రెండో సీజ‌న్ మొత్త‌నికి నాని చేతే చేయించారు బిగ్‌బాస్‌.దీని వ‌ల్ల త‌న సినిమాలు చాలా లేట్ అయ్యాయ‌ని ,అందుకే బిగ్‌బాస్ మూడో సీజ‌న్‌కు రాలేన‌ని నాని బిగ్‌బాస్ టీంకు తెలిపాడ‌ని స‌మాచారం.పైగా బిగ్‌బాస్ చేస్తే అవుట్ డోర్ షూటింగ్‌ల‌కు వెళ్లడానికి కుద‌ర‌దు,ఎక్క‌డ ఉన్న త‌ప్ప‌ని సరిగా శని,ఆదివారాల‌లో షోకి రావ‌ల్సేందే.దీని కార‌ణంగా కూడా నాని మూడో సీజ‌న్‌కు నో చెప్పాడ‌ని తెలుస్తుంది.ఇక నాని మూడో సీజ‌న్ నుంచి త‌ప్పుకోవ‌డానికి ప్ర‌ధాన కారణం మాత్రం ఇదే అంటున్నారు.బిగ్‌బాస్ వ‌ల్ల నాని త‌న ఇమేజ్‌ను పెంచుకోవాల్సిందిపోయి త‌గ్గించుకున్నాడ‌ని చాలమంది అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మొద‌టి సీజ‌న్ ఎన్టీఆర్ యాంకరింగ్‌తో పోలిస్తే రెండో సీజ‌న్‌లో నాని యాంక‌ర్ పెద్దగా ఎవ‌రికి న‌చ్చ‌లేద‌ని తెలుస్తుంది.పైగా నాని ఈ షో వ‌ల్ల సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ ఫేస్ చేశాడు.చివరికి ట్రోల‌ర్స్‌కు కూడా నాని వివ‌ర‌ణ ఇవ్వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఇక మీద ఇలాంటి షోలు చేయ‌కూడ‌ద‌ని నాని డిసైడ్ అయిన‌ట్లు స‌మాచారం.దీనిలో భాగంగానే నాని నిన్న‌(ఆదివారం) షోలో ఇదే చివ‌రిది ,ఇక మీద క‌నిపించ‌ను అని అన‌డం చూస్తే నాని మూడో సీజ‌న్‌ను ఎట్టి ప‌రిస్థితుల‌లో చేయ‌డ‌ని చాలమందికి అర్థం అయింది.మ‌రి బిగ్‌బాస్ మూడో సీజ‌న్ హౌస్ట్‌గా ఎవ‌రు క‌నిపిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -