Tuesday, May 21, 2024
- Advertisement -

గుంటూరులో జ‌రిగిన అనుభ‌వాన్ని జీవితంలో మ‌ర్చిపోలేను

- Advertisement -

ఛ‌లో సినిమాతో తెలుగు ఇంగ‌స్ట్రీలో అడుగుపెట్టింది హీరోయిన్ ర‌ష్మిక‌.త‌ను న‌టించిన రెండో సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది ర‌ష్మిక‌.విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఆమె న‌టించిన గీతా గోవిందం మంచి విజ‌యాన్ని సాధించింది.గీతాగా ఆమె చేసి న‌ట‌న‌కు చాల‌మంది ర‌ష్మిక‌కు ఫ్యాన్స్ అయిపోయారు.తాజాగా ఆమె న‌టించిన దేవ‌దాస్ సినిమా కూడా సూప‌ర్ కావ‌డంతో మంచి జోష్‌లో ఉంది.ఈ సంద‌ర్భంగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసింది ర‌ష్మిక‌.తెలుగులో త‌న మొద‌టి మూడు సినిమాలు విజ‌యాలు సాధించ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేసింది.ఇక త‌న‌కు మొద‌టి తెలుగు సినిమాలో జ‌రిగ‌న అనుభ‌వాన్ని చెప్పుకొచ్చింది.

రష్మిత కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. కూర్గ్ ప్రత్యేకత ఏమంటే.. ఎప్పుడు చల్లగా ఉండి.. దట్టమైన కాఫీ తోటలతో నిండి ఉంటుంది. మేలో మనకు నిప్పులు చెరిగే సూరీడు ఉంటే.. మనకు కాస్త దూరంలో ఉన్న కూర్గ్ లో మాత్రం చలితో వణికిపోవాల్సిందే. ఏడాది మొత్తం కూల్ కూల్ గా ఉండే ఈ కూర్గ్ భామ తన తొలి తెలుగు సినిమా షూటింగ్ లో భాగంగా గుంటూరుకు వెళ్లాల్సి వచ్చింది.మామూలుగానే గుంటూరు వేడిగా ఉంటుంది. ఇక.. ఎండాకాలం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక దశలో అయితే ఆమె వంటి నుంచి పొగలు.. సెగలు కక్కటమే కాదు.. వామ్మో.. గుంటూరా? అనే పరిస్థితి. జీవితంలో గుంటూరు అనుభ‌వాన్ని మ‌ర్చిపోలేన‌ని తెలిపింది ర‌ష్మిక‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -